Social Justice Meet: స్టాలిన్ ఏర్పాటు చేసిన ‘సామాజిక న్యాయం’ సమావేశం.. మోదీ వేవ్‌ని అడ్డుకుంటుందా?
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి రాజా తదితరులు హాజరుకానున్నారు

MK Stalin
Social Justice Meet: దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేవ్‌ని అడ్డుకోవడంలో విపక్షాలు తరుచూ విఫలం అవుతూనే ఉన్నాయి. మెజారిటీగా ఉన్న హిందుత్వ ఓట్లను ఏకం చేసి విజయాలతో దూసుకుపోతోంది. బీజేపీ ముందు విపక్షాలు నిలబడలేకపోతున్నాయి. అయితే విపక్షాలు ఏకం అయితే బీజేపీని ఓడించొచ్చనే వాదన పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కారణం, అనేక రాష్ట్రాల్లో బీజేపీని స్థానిక పార్టీలు బాగానే నిలువరించాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోపు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటితో కూటమి ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల్లో కొంత మంది నేతలు ఉన్నారు.
అయితే అనేక రాజకీయ కారణాల వల్ల విపక్షాలు ఒకతాటిపైకి రాలేకపోతున్నాయి. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, కేసీఆర్ వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆచరణలో చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించడం లేదు. కాగా, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సోమవారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘సామాజిక న్యాయం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో చాలా మంది విపక్ష నేతలు పాల్గొన్నారు. అంతే కాకుండా.. ఓబీసీ కుల గణన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
Odisha: క్రికెట్ ఆడుతుండగా ‘నో బాల్’ చెప్పినందుకు అంపైర్ హత్య
హిందుత్వ రాజకీయాన్ని ఢీకొట్టేందుకు సామాజిక న్యాయం కౌంటర్ అటాక్ అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ స్టాలిన్ చేసే ఈ ప్రయత్నానికి కావాల్సినంత ఊపు వస్తే.. ఓబీసీలను బీజేపీ నుంచి దూరం చేయవచ్చని, ఆ విధంగా బీజేపీని దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, భేటీలో ఎలాంటి రాజకీయ కోణం డీఎంకే ఖండించింది. అయితే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఓబ్రెయిన్ మాత్రం పక్కా రాజకీయమేనని అన్నారు.
Love Today: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకున్న లవ్ టుడే.. ఎప్పుడంటే?
“ఇది రాజకీయ వేదిక అనే వాస్తవం నుంచి మనం సిగ్గుపడకూడదు” అని అన్నారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి కూటమిలో చేరాలని కోరారు. “రెండు మూడు పార్టీలు బీజేపీతో పోరాడితే సరిపోదు. ఒక్కోసారి మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తాయి. అయితే నల్లగా లేదంటే తెల్లగా.. స్పష్టంగా ఉండాలి. మసకమసకగా ఉండకూడదు” అని ఓబ్రెయిన్ అన్నారు.
ఇక సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి రాజా తదితరులు హాజరుకానున్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు మద్దతు ఇవ్వనున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన అనంతరం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో భాగంగా జరిగిన తొలి ప్రయత్నం ఇదే.