Odisha: క్రికెట్ ఆడుతుండగా ‘నో బాల్’ చెప్పినందుకు అంపైర్ హత్య
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారి పేర్కొన్నారు.

cricket field
Odisha: ఎక్కడైనా క్రీడాస్ఫూర్తి ఉండాలంటారు. కానీ ఇది చాలా సందర్భాల్లో క్రీడల్లోనే లోపిస్తుంటుంది. గెలవాలనే ఆరాటం, ఓడిపోయామనే కుంగుబాటు అనేక అనర్థాలకు దారి తీస్తుంటుంది. ఆట మధ్యలో జరిగే చిన్ని చిన్ని గొడవలు కూడా ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంటాయి. ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఇలాంటి ఒక దారుణమే జరిగింది. క్రికెట్ ఆట నడుస్తుండగా.. ‘నో బాల్’ చెప్పినందుకు అంపైర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మరణించిన వ్యక్తి పేరు లక్కీ రౌత్ (22).
Baby Movie : బేబీ కోసం వస్తున్న 12 మంది సంగీత దర్శకులు.. డెబ్యూట్‌తోనే వైష్ణవి అదరగొడుతుందిగా!
ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కీ రౌత్ మ్యాచ్‌కి అంపైర్‌గా ఉన్నాడు. మధ్యలో ఒకసారి నో బాల్ చెప్పాడు. అంతే ఒక ఆటగాడితో మాటా మాటా పెరిగింది. ఇంతలోనే అతడు పదునైన కత్తి తీసుకుని లక్కీ రౌత్‌ను పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావంలో ఉన్న అతడిని సమీపంలోని సీబీ మెడికల్ కాలేజీ-ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, విషయం తెలియగానే క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు.
ఈ దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారి పేర్కొన్నారు.