Akshilesh vs Mayawati: కాన్షీరాం విగ్రహం ఆవిష్కరించిన అఖిలేష్.. గెస్ట్ హౌజ్ మోసాన్ని గుర్తు చేస్తూ కత్తి దూసిన మాయావతి

అఖిలేష్ యాదవ్ మీద బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జరిగిన గెస్ట్ హౌజ్ ఘటనను గుర్తు చేస్తూ.. అది జరక్కుండా ఉండుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కొనసాగి ఈ దేశాన్ని పాలించి ఉండేదని అన్నారు. అంబేద్కర్, కాన్షీరాం, దళితులు, ఓబీసీల మీద ఎస్పీ కులపరమైన ధ్వేషాన్ని చూపించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

Akshilesh vs Mayawati: కాన్షీరాం విగ్రహం ఆవిష్కరించిన అఖిలేష్.. గెస్ట్ హౌజ్ మోసాన్ని గుర్తు చేస్తూ కత్తి దూసిన మాయావతి

akhilesh vs mayawati

Updated On : April 13, 2023 / 12:52 PM IST

Akshilesh vs Mayawati: దేశ రాజకీయాలంటే యూపీ రాజకీయాలు.. యూపీ రాజకీయాలంటే దేశ రాజకీయాలు. దేశంలో మరే రాష్ట్రంలో లేనన్ని పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే ఢిల్లీ కోటను ఆశగా చూసే ప్రతి పార్టీ ముందు యూపీనే ఎంచుకుంటుంది. విచిత్రంగా ఆ రాష్ట్రంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ, మరొకటి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న సమాజ్‭వాదీ పార్టీ. చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాలను ఈ రెండు పార్టీలే శాసించినప్పటికీ ఏ ఒక్క పార్టీ నుంచి ప్రధాని కాదు కదా.. కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ చోటు దక్కలేదు.

Pawan Kalyan Delhi Tour: ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో భేటీ ..!

ఈ రెండు పార్టీ కలిస్తే దేశ రాజకీయాలు తలకిందులవుతాయనే చర్చలు, విశ్లేషణలు అనేకం వస్తూనే ఉంటాయి. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్, కాన్షీరాం ఏకమై రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనప్పటికీ, ఆ పొత్తు తొందర్లోనే తెగింది. ఇక అప్పటి నుంచి ఉప్పు-నిప్పుగా ఉన్న ఈ రెండు పార్టీలు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఈ కూటమికి మహా ఓటమి ఎదురు కావడంతో ఎన్నికల అనంతరమే పొత్తు తెగిపోయింది. ఇక మళ్లీ ఇరు పార్టీల మధ్య యుద్ధం మొదలైంది.

Karnataka Elections 2023: కర్ణాటకలో ఎన్నికల హడావుడి.. కాంగ్రెస్ కార్యాలయం ముందు రచ్చ రచ్చ

ఇక తాజా పరిస్థితులను చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నట్టుండి కాన్షీరాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోమవారం రాయ్ బరేలి వెళ్లిన ఆయన.. ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు కాన్షీరాం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా, కాన్షీరాం విగ్రహాన్ని అఖిలేష్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. వాస్తవానికి రాజకీయపరంగానూ కాన్షీరాం పేరును అఖిలేష్ ప్రస్తావించరు. మాయావతి మీద బీఎస్పీ మీద తరుచూ విమర్శలు చేసే అఖిలేష్.. కాన్షీరాం విగ్రహాన్ని ఆవిష్కరించడం దళితులను ఆకర్షించడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Maneka Gandhi : గాడిద పాలతో చేసిన సబ్బు మహిళలను అందంగా చేస్తుంది రూ. 500లకే ఈ సబ్బు లభిస్తోంది : మేనకాగాంధీ

ఇక ఇది ఇలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ మీద బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జరిగిన గెస్ట్ హౌజ్ ఘటనను గుర్తు చేస్తూ.. అది జరక్కుండా ఉండుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కొనసాగి ఈ దేశాన్ని పాలించి ఉండేదని అన్నారు. అంబేద్కర్, కాన్షీరాం, దళితులు, ఓబీసీల మీద ఎస్పీ కులపరమైన ధ్వేషాన్ని చూపించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Odisha: క్రికెట్ ఆడుతుండగా ‘నో బాల్’ చెప్పినందుకు అంపైర్ హత్య

కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం పెరిగింది. అయితే ఇరు పార్టీలకు ఇరు పార్టీలు.. బీజేపీకి అనుకూలురనే విమర్శలు చేసుకుంటున్నాయి. కేసులకు భయపడి బీజేపీకి మాయావతి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అఖిలేష్ ఆరోపిస్తుండగా.. ఎస్పీ వల్లే బీజేపీ బలపడుతోందని మాయావతి విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీని వదిలేసి ఈ రెండు పార్టీలో కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. పైగా సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో ఈ రెండు పార్టీల పరిణామాలు ఎటు వైపుకు దారి తీస్తాయనే ఆసక్తి పెరిగింది.