నెలసరి సమయంలో కూడా మహిళలు ఆ గుడిలో పూజలు చేసుకోవచ్చు

భారతదేశం తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఆలయం ‘మా లింగా భైరవి’.ఈ ఆలయంలో మహిళలు రుతుస్రావం సమయంలో కూడా దేవతను ఆరాధించవచ్చు.
కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఉన్న మా లింగా భైరవి ఆలయం స్త్రీలు మాత్రమే ఆలయ లోపలి గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతిఉంటుంది.
సద్గురు జగ్గీ వాసుదేవ్ చాలా ఉన్నతభావాలు కలిగిన వ్యక్తి. మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమనీ ఆ సమయంలో మహిళలు గుడికి రాకూడదు..పూజలు చేయకూడదనే ఆంక్షలు సరైనవి కాదని ఆయన భావిస్తారు. దీంతో ఆలయంలో మహిళలు పూజలు చేయటానికి ఎటువంటి ఆంక్షలు ఉండకూదనే సద్గురు సదుద్దేశం మా లింగా భైరవి ఆలయంలో మహిళలు రుతుస్రావం (నెలసరి) సమయంలో కూడా పూజలు చేసుకోవటానికి అనుమతిని కల్పించారు.
ఈ మా లింగా భైరవి ఆలయానికి మహిళలు..పురుషులు ఇద్దరూ వస్తారు కాని స్త్రీలు మాత్రమే లోపలి గర్భగుడిలోకి ప్రవేశించి దేవతను ఆరాధించేలా అక్కడ అనుమతి ఉంటుంది. రుతుస్రావం సమయంలో కూడా మహిళా సన్యాసులకు..మహిళా భక్తులకు ఆలయానికి వచ్చి పూజలు చేసుకోవచ్చు.
భారతదేశంలోని అనేక కుటుంబాలలో రుతుస్రావం అంటే అంటరానితనంగా భావిస్తున్నారు.అశుద్దంగా భావిస్తున్నారు.ఆ సమయంలో స్త్రీలు సాధారణ జీవితాన్ని అనుభవించకూడదు. ఇంట్లోకి రాకూడదు. పూజలవైపు అస్సలు కన్నెత్తికూడా చూడకూడదు. ప్రతిరోజు భారత్ లో ఎన్ని లక్షల మంది స్త్రీలు తమ ముట్టుని గుట్టుగా అనుభవిస్తున్నారో! తండ్రికి తెలియకూడదు. అన్న దమ్ములకి తెలియకూడదు. అతి రహస్యంగా వుండాలి. ఆ విషయం బట్ట బయలుకాకుండా ‘బయట’ వుండాలి. నిషేధాజ్ఞలు, విధి విధానాలు పన్నెండేళ్ళకే మొదలైతే ఏ యాభై ఏళ్ళో వచ్చేదాకా చాపా, చెంబు అతి రహస్యంగా ఉండాల్సిందేనంటోంది.
కాగా…రుతుస్రావం సమయంలో ఉండగా స్కూలుకు వెళ్లే ఆడపిల్లు ప్రార్థనలో పాల్గొనకూడదనే ఆంక్షలు ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొనసాగుతున్నాయంటే ‘నెలసరి’అనే విషయం ఎంత అంటరానితనంగా ఉందో ఊహించుకోవచ్చు.
కానీ రుతుస్రావం సమయంలో ఉన్నప్పుడు ఆడవారికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో..ఎంతగా వారి శారీరక సమస్యలకు గురవుతారో మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ప్రకృతిధర్మంగా వచ్చే ‘నెలసరి’ విషయంలో సమాజంలో ఆలోచనా తీరు మారాల్సిన అవసరం చాలా ఉంది.