Election Vote: స్కూల్స్ రీ ఓపెన్ చేయకపోతే ఓటేయమంటూ టీచర్లు, పేరెంట్స్ ఆందోళన
టీచర్లు, పేరెంట్స్ తో పాటు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగారు. స్కూల్స్ రీ ఓపెన్ చేయకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేదే..

Re Open
Election Vote: టీచర్లు, పేరెంట్స్ తో పాటు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగారు. స్కూల్స్ రీ ఓపెన్ చేయకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘స్కూల్స్ ఓపెన్ చేయకపోతే.. ఓటు వేయం’ అంటూ స్కూల్స్ రీఓపెన్ గురించి డిమాండ్ చేస్తున్నారు స్కూల్ అడ్మినిస్ట్రేషన్, పేరెంట్స్.
పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఫిబ్రవరి 8వరకూ స్కూల్స్ మూసి ఉంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేర టీచర్లు, పేరెంట్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ నిబంధనలు ఎత్తేయాలని కోరుతున్నారు.
శనివారం పంజాబ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ సైతం ఆందోళనలో పాల్గొన్నాయి. రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్ చేయాలంటూ పిలుపునిచ్చాయి.
Read Also: పూల్ ఒడ్డున జాన్వీ బికినీ షో!
బర్నాలా జిల్లాలో దాదాపు 100మంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. నిరసనకారులు పలు బ్యాక్ గ్రౌండ్స్ కు చెందిన వారు. స్కూల్ మేనేజ్మెంట్, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్ లు ఉననారు.
‘గతేడాది 9నెలల పాటు పాఠశాలలు మూసి ఉంచాం. ఇప్పుడు జనవరి 5నుంచి అదే పరిస్థితి కొనసాగుతుంది. స్టాఫ్, పిల్లలు అందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నాం. అన్నీ ఓపెన్ అయి ఉన్నప్పుడు స్కూల్స్ ఇంకా ఎందుకు మూసి ఉంచుతున్నార’ని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అంటున్నారు.