Delhi Aiims : మూడు నెలల పసిబిడ్డకు కిడ్నీ సర్జరీ .. ప్రపంచంలోనే తొలిసారి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఘనత
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారి పసిబిడ్డకు సర్జరీ చసేిన ఘనత సాధించారు.

Delhi Aiims 3 Month baby Kidney Surgery
3 Month Old Boy Kidney Surgery : టెక్నాలజీ సహాయంతో వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులకు ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. కష్టతరమైన సర్జరీలను కూడా డాక్టర్లు అవలీలగా చేస్తు ఎంతోమంది ప్రాణాలు నిలబెతు ఆయా కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నారు. అందుకే డాక్టర్లను దేవుడిగా కొలుస్తారు. ఓ పసిబిడ్డకు కిడ్నీ సర్జరీ చేసిన ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు ఆ బిడ్డ కుటుంబం పాలిట దేవుళ్లే అయ్యారు. మూడు నెలల పసిబిడ్డకు కిడ్నీ సర్జరీ చేశాడు ఎయిమ్స్ డాక్టర్లు.
చిన్నవయస్సు బిడ్డకు కిడ్నీ సర్జరీ ప్రపంచంలోనే తొలిసారి అని తెలిపారు. మూడు నెలల మగశిశువుకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ుల ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. బిడ్డకు రెండు మూత్రపిండాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించారు. ఇంత చిన్న వయసులో ఇటువంటి ప్రక్రియతో చికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. బిడ్డకు పుట్టుకతోనే కిడ్నీ సమస్యలు ఉన్నాయని మూత్ర నాళాన్ని అడ్డుకునే సమస్య ఉందని..మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మూత్ర ప్రవాహాన్ని బలహీన పరిచే సమస్యతో పుట్టిన బిడ్డకు మూడు నెలల తరువాత ఈ చికిత్స చేశామని తెలిపారు.
ఈ సర్జరీని గత ఏడాది డిసెంబరులో పీడియాట్రిక్ విభాగం నిర్వహించిందని..చంటిబిడ్డను మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేశామని ఎయిమ్స్ ప్రకటించింది. మూడు నెలల తర్వాత రినోగ్రామ్ పరీక్షతో ఆపరేషన్ విజయవంతమైన విషయాన్ని ధ్రువీకరించుకున్నామని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ తెలిపారు.