ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గిటార్

  • Published By: venkaiahnaidu ,Published On : October 17, 2019 / 05:14 AM IST
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గిటార్

Updated On : October 17, 2019 / 5:14 AM IST

ప్రపంచంలోని అత్యంత ఖరీదైనదిగా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులలోకెక్కిన గిటార్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఓ జ్యూవెలరీ అండ్ వాచ్ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు.ఈ గిటారుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 12వేల డైమండ్లతో,400 క్యారెట్ల 1.6 కిలోగ్రామ్ల తెల్లబంగారంతో ఈ గిటార్ డెకరేట్ చేయబడింది.

ప్రముఖ పాటల రచయిత మార్క్ లూయి డిజైన్ చేసిన దీని పేరు “ఈడెన్ ఆఫ్ కొరొనెట్”. 68మంది ఆర్టిస్టులు 700రోజులు కష్టపడి దీన్ని తయారుచేశారు. మైకేల్ జాక్స్ బ్రదర్స్ ఈ గిటార్ ను ఉపయోగించిన కొద్దిమందిలో ఉన్నారు. అక్టోబర్-26 నుంచి 30వరకు అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ జ్యూవెలరీ షో జరగనుంది.