Security For Vijay : విజయ్ కు Y కేటగిరీ సెక్యూరిటీ.. అసలేంటీ Y సెక్యూరిటీ, టీమ్ లో ఎంతమంది ఉంటారు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు విజయ్.

Security For Vijay : ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కు వై స్కేల్ సెక్యూరిటీ ఇచ్చారు. ఈ టీమ్ లో 8మంది ఉంటారు. గతేడాది తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీని విజయ్ ప్రారంభించారు. కాగా, ఈ సెక్యూరిటీ కేవలం తమిళనాడు వరకే పరిమితం. 2024 ఫిబ్రవరిలో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు.
వై స్కేల్ సెక్యూరిటీ టీమ్ లో ఒకరు లేదా ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు ఉంటారు. అలాగే సివిల్ పోలీస్ అధికారులు కూడా ఉంటారు. నిర్ధిష్ట బెదిరింపులు ఎదుర్కొంటున్న వారికి ఈ తరహా సెక్యూరిటీ కల్పిస్తారు.
Also Read : మీ సిబిల్ స్కోరు తగ్గడానికి 5 కారణాలివే.. పొరపాటున కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయెద్దు..!
సెక్యూరిటీలో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి. X, Y, Z, Z+. కేంద్ర ప్రభుత్వం ఈ తరహా భద్రతను కల్పిస్తుంది. రోజంతా డ్యూటీలో ఉంటారు. మొత్తం ఆరుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు. అయితే ఈ కేటగిరిలో స్పెషలైజ్జ్ కమాండో లు ఉండరు.
అదే జెడ్ సెక్యూరిటీ విషయానికి వస్తే అందులో 22 మంది ఉంటారు. అందులో నలుగురు లేదా ఐదుగురు ఎన్ ఎస్జీ కమాండోలు ఉంటారు. సివిల్ పోలీస్ కూడా ఉంటారు. అదనపు భద్రతగా ఎస్కార్ట్ వెహికల్ కూడా ఇస్తారు.
Also Read : షాకింగ్.. ఆ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు.. డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోతున్న కస్టమర్లు.. భారీ క్యూ.
ఈ నాలుగు తరహా సెక్యూరిటీలలో Z+ అన్నింటికన్నా పవర్ ఫుల్. ఈ టీమ్ లో సుమారు 55 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఇందులో 10 మంది ఎన్ ఎస్ జీ కమాండోలు ఉంటారు. సాధారణంగా ఉన్నత ప్రభుత్వ అధికారులు, ప్రభావవంతమైన వ్యక్తుల బెదిరింపులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తరహా సెక్యూరిటీ కల్పిస్తారు. జెడ్ + లెవెల్ లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా సెక్యూరిటీ ఇస్తుంది. దేశ ప్రధాని, కుటుంబసభ్యులకు వీరు భద్రతగా ఉంటారు.