షాకింగ్.. ఆ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు.. డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోతున్న కస్టమర్లు.. భారీ క్యూ..
కస్టమర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. అధికారులను నిలదీస్తున్నారు.

న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. దీంతో కస్టమర్లు ఫండ్స్‌ను ఉపసంహరించుకోలేకపోతున్నారు. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్దకు ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు.
ముంబై న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో అవకతవకలు జరిగినట్లు ఇటీవల ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో ఆ బ్యాంక్‌పై తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో కస్టమర్లు నిధులను ఉపసంహరించుకోక, కొత్త రుణాలు పొందలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, ఇంత కష్టంలోనూ వారికి కాస్త ఊరట లభించే విషయం ఏంటంటే ఆ బ్యాంకు డిపాజిటర్లకు డిపాజిట్ బీమా పథక పరిధిలోకి వారు వస్తారు. అంటే, ఈ ఇన్సురన్స్ స్కీమ్ వల్ల.. ఒకవేళ బ్యాంక్ పతనమైతే రూ 5 లక్షల వరకు వారికి అందుతాయి.
ఈ నెల 13 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుపై పలు ఆంక్షలను విధించింది. కొత్త రుణాలు జారీ చేయడం లేదా ఇప్పటికే ఉన్న రుణాలను పునరుద్ధరించడం కుదరదు.
Viral Video: సముద్రంలో యువకుడిని మింగేసిన తిమింగలం.. అయినా ఎలా బయటపడ్డాడో చూడండి..
కొత్త పెట్టుబడులు, డిపాజిట్లను ఆ బ్యాంకులో వేసుకునే అవకాశం ఉండదు. ఈ బ్యాంకులో ఎటువంటి చెల్లింపులు చేయలేరు. అంతేగాక, బ్యాంకు తన ఆస్తులను విక్రయించే అధికారం కూడా ఉండదు. ఈ ఆంక్షలు ఈ నెల 13 నుంచి ఆరు నెలల వరకు అమలులో ఉంటాయి.
ఎందుకీ ఆంక్షలు?
ముంబై న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిసింది. ఆ బ్యాంకు వద్ద తగినంత డబ్బు ఉందా? లేదా? అనే ప్రశ్నలను ఆర్‌బీఐ లేవనెత్తుతోంది.
అందుకే, ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. కస్టమర్ల ప్రయోజనాల కోసమే ఈ పరిమితులు విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
దీంతో కస్టమర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. బ్యాంకుల వద్ద భారీగా క్యూ కట్టి సిబ్బందిని నిలదీస్తున్నారు. చాలా మంది బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేద్దామని అనుకుంటున్నా బ్యాన్ వల్ల ఆ పని చేయలేకపోతున్నారు.