Shivling : తన కోరిక తీర్చలేదని శివుడిపై యువకుడు కోపం, గుడిలో శివలింగాన్ని చోరీ చేసి ఏం చేశాడంటే..

తన కోరిక తీర్చలేదని శివుడిపై కోపగించుకున్నాడు ఓయువకుడు. గుడిలో లింగాన్ని ఎత్తుకుపోయాడు.

Shivling : తన కోరిక తీర్చలేదని శివుడిపై యువకుడు కోపం, గుడిలో శివలింగాన్ని చోరీ చేసి ఏం చేశాడంటే..

Shivlingam stolen

UP Young man Shivling stolen : దేవుడిని కోరికలు కోరుకోవటం అవి తీరితే మొక్కులు చెల్లించుకోవటం చాలామంది చేస్తుంటారు. కానీ కోరిన కోరిక తీరకపోతే దేవుడిపై కోపగించుకుంటారా..? అంటే నేనంతే అంటూ ఓ యువకుడు తన కోరిక తీర్చని శివుడిపై కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతో ఏకంగా గుడికి వెళ్లి శివలింగాన్ని ఎత్తుకుపోయాడు.ఎత్తుకుపోయాక ఏం జరిగిందంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని కౌశాంబి జిల్లా(Kaushambi district)లో చోటూ అనే 27 ఏళ్ల యువకుడు వారి గ్రామానికే చెందిన ఓ యువతి ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాడు. ఆ యువతి ఇంటికెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనకుంటున్నాను అంటూ అడిగాడు. కానీ వారు ఒప్పుకోలేదు. దీంతో చోటు వారి గ్రామంలోని ఓ శివాలయానికి వెళ్లాడు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కేలా చేయి దేవుడా అంటూ వేడుకున్నాడు. నేను అనుకున్నది జరిగిలే అనుగ్రహించు అని శివయ్యను ప్రతీరోజు వేడుకునేవాడు. అలా ప్రతీరోజు గుడికెళ్లి ప్రార్థించేవాడు. అలా వరుసగా క్రమం తప్పకుండా నెల రోజులు గుడి చుట్టు ప్రదిక్షణలు చేసి వేడుకున్నాడు. ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరిస్తాడని నమ్మాడు. అదే నమ్మకంతో ఆ అమ్మాయి ఇంటికెళ్లి మరోసారి అడిగాడు. కానీ వాళ్లు మాత్రం అంగీకరించలేదు. దీంతో నెల రోజుల పాటు ప్రతీరోజు నీ గుడికి వచ్చి వేడుకున్నానే..అయినా నీకు కనికరం కలగలేదు..నువ్వసలు దేవుడివేనా…?భక్తుల బాధలు తీర్చలేని నీకు నీకు పూజలెందుకు..? అంటూ మండిపడ్డాడు. శివలింగం వద్దకెళ్లి తన బాధనంతా వెళ్లగక్కాడు. నీకసలు మనసే లేదు అంటూ తిట్టిపోసాడు. అక్కడితో ఊరుకోకుండా గుడిలో శివలింగాన్ని ఎత్తుకుపోయాడు. లింగాన్ని గ్రామం చివరిలో ఉండే పొదల్లో దాచేశాడు.

ఆ మరునాడు గుడిలో శివలింగం కనిపించకపోయేసరికి గ్రామస్థులు కంగారుపడ్డారు. మహేవా ఘాట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. తన టీమ్ తో వచ్చిన పోలీసులు గ్రామస్తుల్ని విచారించారు.దీంతో చోటు ప్రతీరోజు గుడికి వచ్చి పెళ్లి కోసం ప్రార్థించేవాడని చెప్పారు. దీంతో పోలీసులు చోటుపై అనుమానంతో సెప్టెంబర్ 3(2023)న అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే లింగాన్ని తీసుకెళ్లి పొదల్లో దాచానని చెప్పాడు. దీంతో పోలీసులు అతను చెప్పిన ప్రదేశానికి గ్రామస్తులతో కలిసి వెళ్లి చూడగా శివలింగం కనిపించింది. లింగాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని గ్రామస్తులకు అప్పగించారు.వారి దాన్ని తీసుకెళ్లి తిరిగి గుడిలో ప్రతిష్టించారు. చోటును మాత్రం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.