దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయండి: రాహుల్ ట్వీట్ 

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 07:20 AM IST
దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయండి: రాహుల్ ట్వీట్ 

Updated On : April 11, 2019 / 7:20 AM IST

ఢిల్లీ:  దేశ భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించి తెలివిగా ఓటు వేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ స్పందిస్తూ..రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు, అచ్ఛే దిన్‌ ఇవేవీ లేవు. నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతుల బాధలు, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌, సూట్‌ బూట్‌ సర్కార్‌, రఫేల్‌, అబద్ధాలు, హింస, ద్వేషం, భయం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీరు దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి తెలివిగా ఓటు వేయండి’’ అని రాహుల్ ట్విటర్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.