Mumbai : కదులుతున్న ట్రైన్.. ఫుడ్ బోర్డ్‌పై ప్రయాణికుడు.. ఫోన్ ఎక్కడ పెట్టాడో చూడండి.. షాకవుతారు
రైళ్లలో కొందరు ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్న ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mumbai
Mumbai : కదులుతున్న రైళ్లలో వీడియోలు, రీల్స్, డ్యాన్సులు.. ఇంకాస్త ముందుకు వెళ్లి కొందరు ప్యాసింజర్లు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇవిలా ఉంటే ఫుట్ బోర్డుపై నిలబడిన ఓ ప్రయాణికుడు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తన సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాడో చూస్తే షాకవుతారు.
Rinku Singh : రింకూసింగ్ సిక్స్ కొడితే అట్లుంటది మరి!.. స్టేడియంలో బద్దలైన గ్లాస్.. వీడియో వైరల్
ముంబయి లోకల్ ట్రైన్.. ఓ ప్రయాణికుడు ఫుట్‌బోర్టుపై నిలబడ్డాడు. ఎంత రద్దీలో ఉన్నా.. ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా సెల్ ఫోన్ మాత్రం దగ్గరలోనే ఉండాలి అన్నట్లుగా ఉంది కొందరి తీరు. ఆ ప్రయాణికుడు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డోర్ ప్యానల్‌కి ఫోన్ అమర్చి మ్యూజిక్ వింటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ‘ముంబయిలో మాత్రమే’ అనే ట్యాగ్ లైన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ‘మోయే మోయే’ ట్రెండింగ్ సాంగ్ వినపడుతుంది. తనను జనాలు వీడియో తీయడం గమనించిన ఆ ప్రయాణికుడు చేతులు ఊపడం కూడా వీడియోలో కనిపించింది.
Naatu Naatu : నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.. పిక్ వైరల్
ఈ వీడియో క్లిప్ _aamchi_mumbai_’s అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఒక్కసారిగా ఈ వీడియో వ్యూస్‌తో దూసుకుపోయింది. 5.5 మిలియన్ల మంది వీక్షించారు. నెటిజన్లు ఆ ప్రయాణికుడి నిర్లక్ష్యంపై ఆందోళన పడ్డారు. ‘ఇది ప్రమాదకరం.. సిగ్నల్ ఫ్లాష్ కారణంగా ఇది భారీ వోల్ట్ షాక్‌కి దారి తీస్తుంది’ అని కూడా మెసేజ్‌లు పెట్టారు. ఇక ఈ వీడియోపై రైల్వే అధికారులు ఎలా స్పందిస్తారో మరి.
View this post on Instagram