Rinku Singh : రింకూసింగ్ సిక్స్ కొడితే అట్లుంటది మరి!.. స్టేడియంలో బద్దలైన గ్లాస్.. వీడియో వైరల్

రింకూ సింగ్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రింకూ సిక్స్ కొడితే అట్లుంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rinku Singh : రింకూసింగ్ సిక్స్ కొడితే అట్లుంటది మరి!.. స్టేడియంలో బద్దలైన గ్లాస్.. వీడియో వైరల్

Rinku Singh

IND vs SA 2nd T20 match : రింకూ సింగ్.. ఈ పేరు వినిపిస్తే చాలు అతను మైదానంలో కొట్టే సిక్సర్ల మోత గుర్తుకొస్తుంది. రింకూ క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి ఎవరైనా బాల్ బౌండరీ దాటాల్సిందే. అలా ఉంటుంది రింకూ బ్యాటింగ్ తీరు. తాజాగా టీమిండియా జట్టు సౌతాఫ్రికా టూర్ లో ఉంది. తొలుత మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆడుతుంది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ లో రింకూసింగ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ కూడా ఆఫ్ సెంచరీ చేశాడు. అయినా ఓటమి తప్పలేదు. అయితే, ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రింకూ సిక్స్ కొడితే అట్లుంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : India vs South Africa 2nd T20 : దంచికొట్టిన రింకు సింగ్, సుర్యకుమార్ యాదవ్.. అయినా తప్పని ఓటమి

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతిగిలింది. ఓపెనర్లు జైస్వాల్, గిల్ ఇద్దరూ డకౌట్లు అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ కొద్దిసేపు దూకుడుగా ఆడినా తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, రింకూసింగ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచారు. వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రింకూ సింగ్ చివర్లో కొట్టిన రెండు సిక్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : IND vs SA T20 Match : సౌతాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే?

జట్టు స్కోర్ 172 వద్ద సఫారీ జట్టు కెప్టెన్ మర్క్ క్రమ్ బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్లో రింకూ సింగ్ వరుసగా సిక్స్ లు కొట్టాడు. ఈ క్రమంలో రింకూ కొట్టిన ఓ సిక్స్ నేరుగా వెళ్లి మైదానంలోని గ్లాస్ అద్దాలకు తగలడంతో అది పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు, ఫొటోలను చూసిన నెటిజన్లు వాట్ ఎ ప్లేయర్ అంటూ రింకూ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.