Snake Catcher : ఓ నారి నీ ధైర్యానికి సెల్యూట్.. పామును అట్టా పట్టి.. ఇట్టా సంచిలో వేసింది!
బొద్దింకను చూస్తేనే ఎగిరి గంతేస్తారు కొందరు.. ఇక పామును కనిపించిందంటే చాలు పరుగులు పెడతారు. అయితే ఎటువంటి భయం లేకుండా ఓ యువతి పాములను చేతులతోనే పట్టుకుంటుంది. ఎవరైనా పాము ఉందని ఫోన్ చేస్తే పరుగుపరుగున వచ్చి పామును పట్టేస్తుంది.

Snake Catcher
Snake Catcher : చాలామంది అమ్మాయిలు ఏదైనా పురుగుని చూస్తేనే బయపడి పరుగుతీస్తారు. కొందరు మాత్రం దేనిని చూసిన భయపడరు.. చేతులతో పట్టుకొని పక్కకు పడేస్తుంటారు. ఇటువంటి వాటిని చూసినప్పుడు భయపడకూడదని తోటివారికి చెబుతుంటారు. అయితే అటువంటి కోవకు చెందిన యువతి మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న నాగేశ్వరి.
ఎటువంటి భయం లేకుండా ఎంతటి పామునైన చేతులతోనే పట్టుకుంటుంది. దానిని తీసుకెళ్లి జనావాసాలకు దూరంగా పడేస్తుంది. పాములు పట్టడంలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్న ఈమె.. ఎవరైనా ఫోన్ చేసి పాము ఉందని చెబితే అక్కడ వాలిపోతుంటారు. పామును పట్టుకొని.. దానిని జనావాసాలకు దూరంగా పడేస్తుంటారు. గత ఏడాది కాలంగా నాగేశ్వరి పదుల సంఖ్యలో పాములను పట్టుకుంది. ఆమె దైర్యం చూసి అందరు ముక్కున వెలుసుకుంటున్నారు.
కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే మరికొందరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నాగేశ్వరి తాను పాములు పట్టుకునే విధానం వీడియో తీసి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తుంది. ఎటువంటి భయం..బెరుకు లేకుండా ఎంత పెద్ద పామునైన పట్టుకొని సంచిలో వేస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram