Funny matrimonial ad : ఓ యువతి పెళ్లి ప్రకటన చూస్తే షాకవుతారు.. కాబోయే వాడికి ఎలాంటి అర్హతలుండాలంటే..
కాబోయే భర్తకి ఎలాంటి అర్హతలు ఉండాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన వివాహ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాడ్ చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు.

Funny matrimonial ad
Funny matrimonial ad : ఈ రోజుల్లో ఇల్లు కట్టడం ఈజీ ఏమో కానీ.. పెళ్లి చేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ అబ్బాయిలు, అమ్మాయిల అభిప్రాయాలు, అభిరుచులు కలవడం చాలా కష్టంగా ఉండటంతో తల్లిదండ్రులకు పెళ్లి చేయడం ప్రహసనంగా మారింది. కొందరు తమ జీవిత భాగస్వామిని తామే ఎంపిక చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఓ పెళ్లి ప్రకటన అందర్నీ నవ్విస్తోంది. తనను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెబుతూ ఆ అమ్మాయి ఇచ్చిన పెళ్లి ప్రకటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Rashmika : రష్మికని ఇంకో పెళ్లికి.. ఓకే చెప్పొద్దంటూ సలహా ఇస్తున్న రణబీర్..
ఇప్పుడంతా డిజిటల్ యుగం. చివరికి పెళ్లిచూపులు, పెళ్లిళ్లు కూడా సోషల్ మీడియా ద్వారానే జరిగిపోతున్నాయి. రీసెంట్‌గా రియా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తనని చేసుకోబోయే వరుడికి ఎలాంటి అర్హతలు ఉండాలో చెబుతూ ఇచ్చిన వివాహ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమకు సరిపోయే భాగస్వామిని వెతకడం కోసం జనం ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ ప్రకటన చూస్తే అర్ధం అవుతుంది.
Assam Govt : రెండో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి : ఉద్యోగులకు సీఎం వార్నింగ్
@Aaayushiiiiiii అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేర్ చేయబడిన పోస్ట్‌లో రియా అనే యువతి తనకు కాబోయే వరుడు కెమెరా అంటే భయం లేని వ్యక్తి ముఖ్యంగా తనతో పాటు రీల్స్ చేసే భాగస్వామి అయి ఉండాలని ప్రకటనలో చెప్పింది. ఇంకా జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉండకూడదట. అంతేకాదు అమెజాన్‌లో వచ్చే ‘హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్’ చూసి ఉండాలట. ఎందుకంటే తనకి ఎటువంటి అబ్బాయిలు నచ్చరో తెలుసుకోవడానికట. ఇక చివరగా తనకి రీల్స్, వ్లాగ్స్ ఎడిట్ చేయడంలో సహాయం చేయడానికి ప్రీమియర్ ప్రోని ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి అయి ఉండాలట. రియా యాడ్ అయితే అందర్నీ ఆకర్షించింది. అయితే ఈ అర్హతలు ఉన్న వ్యక్తిని లైఫ్ పార్టనర్‌గా కంటే తన దగ్గర ఎడిటర్ లేదా ప్రమోటర్‌గా జాబ్‌లో పెట్టుకుంటే బెటర్ అని కొందరు సూచించారు.
probably the WILDEST matrimonial ad ever ?? pic.twitter.com/kIMWGhJlW0
— Aayushi Gupta (@Aaayushiiiiiii) October 27, 2023