Youth Set Fire Himself: గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ ఒంటికి నిప్పంటించుకున్న యువకుడు
అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్‌ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్‌ఫ్రెండ్ పేరు కానీ, గొడవకు సంబంధించిన విషయాలు కానీ ఏమీ వెల్లడించకపోవడం గమనార్హం.

Youth set fire himself while talking video call with girlfriend
Youth Set Fire Himself: ప్రేమికుల మధ్య అనేక గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇవి ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంటాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా పోతుంటాయి. అన్నీ ఉద్దేశపూర్వకంగా జరక్కపోవచ్చు. క్షణికావేశంలో కొన్ని, అనుకోని తప్పిదాల వల్ల కొన్ని జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన కూడా అలాంటిదే. ఒక యువకుడు తన ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు.
వాస్తవానికి తన ప్రయసిని బెదిరించే క్రమంలో అనుకోకుండా అతడికి నిప్పు అంటుకుంది. 30 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ పరశురామ్ జాదవ్ అనే యవకుడు(19) సోమవారం అర్థరాత్రి వినాయక మండపాన్ని సందర్శించిన అనంతరం తన ప్రేయసితో గొడవ పడ్డాడు.
చాలా సేపు ఒక రోడ్డుపై నిలబడి ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చి ప్రేయసికి వీడియో కాల్ చేశాడు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఒంటికి నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో అతడి చొక్కాకి నిజంగానే నిప్పు అంటుకుంది. కాటన్ చొక్కా కావడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. యువకుడు ఫోన్ వదిలేసి అరవడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై మంటలు ఆర్పి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.
అయితే అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్‌ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్‌ఫ్రెండ్ పేరు కానీ, గొడవకు సంబంధించిన విషయాలు కానీ ఏమీ వెల్లడించకపోవడం గమనార్హం.
Viral Video: మాస్క్ పెట్టుకునే గంగాజలం తాగిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్