India vs Sri Lanka: కొహ్లీ డకౌట్.. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా

ఆసియా కప్‌ లో భాగంగా దుబాయి వేదికగా శ్రీలంకతో తలపడుతోన్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6 పరుగులకే వెనుదిరగగా, ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కొహ్లీ మూడు బంతులు వృథా చేసి, డకౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు. ఒక సిక్సు, రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ కు ఒక్కో వికెట్ దక్కాయి.

India vs Sri Lanka: కొహ్లీ డకౌట్.. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా

India vs Sri Lanka

Asia Cup 2022: ఆసియా కప్‌ లో భాగంగా దుబాయి వేదికగా శ్రీలంకతో తలపడుతోన్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6 పరుగులకే వెనుదిరగగా, ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కొహ్లీ మూడు బంతులు వృథా చేసి, డకౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు. ఒక సిక్సు, రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ కు ఒక్కో వికెట్ దక్కాయి.

ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచులో టీమిండియా తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అయితే, ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. శ్రీలంక జట్టు బలంగా ఉండడంతో ఈ మ్యాచు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కొంత కాలంగా ఫాంలేమితో బాధపడుతున్న విరాట్ కొహ్లీ ఈ మ్యాచులోనూ రాణించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు ఆరు ఓవర్లకు 44/2 గా ఉంది.

Strict lockdown in China: భూకంపంతో 65 మంది చనిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న చైనా