Zomato: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు బిగ్‌షాక్.. ఆ ఫీజు పెంచేసిన జొమాటో
యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్యాస్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాస్ ధరలు పెరిగాయి. మరోవైపు చమురు ధరలు భారీగా పెరిగాయి.
Representative Image (Image Credit To Original Source)
- ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వారిపై మరింత భారం
- ప్లాట్ ఫామ్ ఫీజును పెంచింది జొమాటో
- ప్రతి ఆర్డర్ పై 2 రూపాయల 40 పైసలు చొప్పున పెంపు
- ప్లాట్ ఫామ్ ఫీజు రూ.12.50 నుంచి రూ.14.90 కి పెంపు
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వారిపై మరింత భారం మోపింది. ప్లాట్ ఫామ్ ఫీజును పెంచింది జొమాటో. ప్రతి ఆర్డర్ పై 2 రూపాయల 40 పైసలు చొప్పున ఫీజు పెంచింది. ఈ సమాచారాన్ని కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో తెలియజేసింది. ప్రస్తుతం ప్లాట్ ఫామ్ ఫీజు 12 రూపాయల 50 పైసలుగా ఉంది. ఇప్పుడు సవరించిన ధరలతో ఆ ఫీజు 14 రూపాయల 90 పైసలకు పెరిగింది.
ఇక మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్ పై 14 రూపాయల 99 పైసలు చొప్పున ప్లాట్ ఫామ్ ఫీజును వసూలు చేస్తోంది. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్యాస్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాస్ ధరలు పెరిగాయి. మరోవైపు చమురు ధరలు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా ప్లాట్ ఫామ్ ధరలు పెంచక తప్పడం లేదని ఫుడ్ డెలివరీ యాప్స్ అంటున్నాయి.
స్విగ్గీ వినియోగదారుల నుండి ఎంత వసూలు చేస్తోంది?
ఫుడ్ డెలివరీ అప్లికేషన్ జొమాటోకు ప్రధాన పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్‌కు రూ. 14.99 డెలివరీ ఫీజు వసూలు చేస్తోంది. తాజాగా జొమాటో కూడా ప్లాట్ ఫామ్ ఫీజు పెంచడంతో.. ఇప్పుడు రెండూ ఒకే మొత్తాన్ని వసూలు చేయనున్నాయి.
Also Read: కర్ణాటకలో వడగళ్ల వాన.. బిల్ గేట్సే కారణమంటున్న నెటిజనులు.. అసలేం జరిగిందంటే..
