Antique Chair : 130 ఏళ్ల నాటి నిజాం కుర్చీ .. కూర్చుంటే కుర్చీ, మడిస్తే మెట్లు

పురాతన కాలంనాటి ఓ కుర్చీ మడిస్తే మెట్లులా మారిపోతోంది. కళాకారుడి సృజనాత్మకతకు ఈ కుర్చీ నిదర్శనంగా కనిపిస్తోంది.

Antique Chair : 130 ఏళ్ల నాటి నిజాం కుర్చీ .. కూర్చుంటే కుర్చీ, మడిస్తే మెట్లు

antique Chair Can be used as Steps

chair turns into a steps: అదొక కుర్చీ. చూస్తే కుర్చీలానే ఉంటుంది. మరి కుర్చీ కుర్చీలా ఉండకుండా ఇంకెలా ఉంటుంది..? మరీ చోద్యం కాకపోతే అనుకుంటున్నారా..? ఎందుకంటే ఈ కుర్చీ అలాంటిలాంటి కుర్చీ కాదు. చూస్తే కుర్చీలా కనిపిస్తుంది. కానీ తిరగేస్తే మెట్లులా మారిపోతుంది.  ఈ కుర్చీలో దర్జాగా కూర్చోనూవచ్చు. మెట్లలా వాడుకోనువచ్చు.  అంటే కూర్చుంటే కుర్చీ..మడిస్తే మెట్లు అనేలా తయారు చేశాడు ఓ కళాకారుడు.

ఈ వినూత్న కుర్చీని రాఘవేంద్ర సర్వం అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆయన ఈ కుర్చీ గురించి చెబుతు ఇది హైదరాబాద్ సంస్థానాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన నిజాం నవాబుల నాటి కుర్చీ అని దీనికి 130 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు రాఘవేంద్ర సర్వం. 130 ఏళ్ల నాటి ఈకుర్చీని మడిస్తే మెట్లలా మారిపోతోంది అంటూ పేర్కొన్నారు. ఈ కుర్చీని తయారు చేసిన కళాకారుడు ఎవరో గానీ భలే ఐడియాతో తయారు చేశారనిపిస్తోంది.దీన్ని మెట్ల కుర్చీ అని అనుకోవచ్చు.