Crocodiles River : ఓరి నాయనో ఇది మొసళ్ల లోకమా ఏంటీ..? పట్టు తప్పి పడితే ఎముకలు కూడా మిగలవు

ఒకటి రెండు మొసళ్లను చూస్తే వెన్నులో వణుకు పట్టుకొస్తుంది.అటువంటిది వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ఉన్న మొసళ్ల మధ్యలోంచి దూసుకెళ్లటమంటే ఎలా ఉంటుంది.ఇదిగో ఇలా ఉంటుందనే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Crocodiles River : ఓరి నాయనో ఇది మొసళ్ల లోకమా ఏంటీ..? పట్టు తప్పి పడితే ఎముకలు కూడా మిగలవు

Boat ride in Crocodiles River

Crocodiles : అదొక వాగు. ఆ వాగు నిండా మొసళ్లే. గుట్టలు గుట్టలుగా వేల సంఖ్యలో మొసళ్లు ఉన్నాయి. ఆ వాగుని చూస్తుంటే అది మొసళ్ల లోకమా ఏంటీ.. అనే భయం కలుగుతోంది. అటువంటి వాగులోంచి ఓ పడవ రయ్ మంటూ దూసుకెళుతుంది. పడవ దూసుకెళుతుంటే మొసళ్లు చెల్లా చెదుగా అటు ఇటు పరిగెట్టం చూస్తుంటే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది.

ఆఫ్రికాలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో మొసళ్లను చూస్తుంటే మాత్రం నిజంగా ఎంత ధైర్యముంటే అటువంటి చోటికి పడవమీద వెళ్లటం అనిపిస్తోంది. అసలు అంత డేంజరస్ వాగులోకి పడవ వేసుకెళ్లే అవసరం ఏంటీ..? చేపల కోసం వెళ్లారా..? లేక మొసళ్ల కోసం వెళ్లారా..? అనిపిస్తోంది.

Antique Chair : 130 ఏళ్ల నాటి నిజాం కుర్చీ .. కూర్చుంటే కుర్చీ, మడిస్తే మెట్లు

39 సెకెన్ల ఈ చిన్న వీడియోలో ఓ చేపల పడవ వాగులో దూసుకెళుతోంది. పడవ దూసుకెళుతుంటే వాగులోని నల్లని మొసళ్లు భయపడి అటు ఇటు పరుగులు తీస్తుంటాయి. ఒకేచోట వేల సంఖ్యలో మొసళ్లు అటూ ఇటూ పరుగెడుతుంటే పడవ ముందుకు దూసుకెళుతోంది. నల్లటి రంగులో ఉన్న మొసళ్లు కొరమీను చేపల్లా పెద్ద సంఖ్యలో ఒకచోట పడి ఉండడం చూస్తుంటీ వెన్నులోంచి వణుకు పుట్టటం ఖాయం.

ఏమాత్రం పట్టు తప్పి పడవలోంచి పడ్డారా…ఇక అంతే సంగతులు ఎముకలు కూడా దొరకవు. కరకరా మకరాలు (మొసళ్లు) కొరికి కొరికి మింగేయటం పక్కా..ఈ వీడియోకు వ్యూస్ కూడా ఆ వాగులో ఉండే మొసళ్ల కంటే భారీగానే వస్తున్నాయి. మొసళ్లలోంచి పడవ దూసుకెళుతున్న వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు…మరి మీరు కూడా ఓ లుక్కేయండీ మకరాల వాగుపై..