viral video : కాసేపు ఆగలేకపోతున్నావా .. పెళ్లి పీటలపైనే వరుడు చెంపఛెళ్లుమనిపించిన వధువు

పెళ్లి పీటలపై వరుడు చేసిన పనికి వధువుకు చిర్రెత్తుకొచ్చింది.అంతే ఛెళ్లు మంటూ అతని చెంపమీద ఒక్కటిచ్చింది. పాపం గురుడికి దిమ్మ తిరిగిపోయింది. కిక్కురుమనలేదు.

viral video : కాసేపు ఆగలేకపోతున్నావా .. పెళ్లి పీటలపైనే వరుడు చెంపఛెళ్లుమనిపించిన వధువు

bride slaps groom

Updated On : September 13, 2023 / 11:43 AM IST

bride slaps groom : ఎంత చపలచిత్తులైనా..ఎంత పోరికీగాళ్లైనా పెళ్లి పీటలమీద బుద్ధిగా కూర్చోవాలి. లేదంటే ఇదిగో ఈ పెళ్లికొడుకు చెంప పగిలినట్లేగా ఎవరికైనా జరగొచ్చు. ఓ వధువు పెళ్లి పీటలమీద కూర్చుని కాసేపట్లో తాళి కట్టే వరుడిని చెంప ఛెళ్లుమనిపించింది. అంతేకాదు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని కూడా ఒక్కటి పీకింది.కోపంతో ఎడంచేత్తో తన పక్కన కూర్చున్నవాడికి ఒక్కటిచ్చింది. ఆ తరువాత పెళ్ళికొడుకు చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో పెళ్లికొచ్చిన అమ్మాయిలంతా పగలబడి నవ్వారు. ఇంతకీ ఆ వధువు వరుడ్ని ఎందుకు కొట్టిందో తెలిస్తే అబ్బాయిలంతా కాస్త కుదురుగా ఉండే అవకాశం లేకపోలేదు..మరి పెళ్లికొడుకు ఎలా ఉండాలి? చక్కగా బుద్దిగా ఉండాలి. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం పెళ్లి పీటలమీదే కాస్త ఓవర్ చేశాడు. కాబోయే భార్య చేతి దెబ్బ రుచి చూశాడు. వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ పెళ్లి ఎక్కడ జరిగింది అనేది తెలియదుగానీ పెళ్లి సంప్రదాయం చూస్తే నార్త్ ఇండియాలో జరిగినట్లుగా తెలుస్తోంది. పెళ్లి కొడుకు నోట్లో గుట్కా పెట్టుకుని వచ్చి పెళ్లి పీటలపై కూర్చున్నాడు. గుట్కా నములుతూ కులాసాగా కూర్చున్నాడు. బుగ్గను అటూ ఇటూ ఆడిస్తు చక్కగా నములుతున్నాడు. దీంతో పెళ్లికూతురికి చిర్రెత్తింది. అంతలోనే ఆమె పక్కనే కూర్చున్న వ్యక్తం ఆమెకు ఏదో చెప్పాడు. అంతే అతడిని లాగి ఒక్కటిచ్చింది. తర్వాత గుట్కా తింటున్న వరుడివైపు తిరిగి ఎడమ చేత్తో ముఖమ్మీద ఫెటీల్మని కొట్టింది.

Tigers : పక్కా ప్లాన్‌తో పులుల్ని చంపి ప్రతీకారం తీర్చుకున్న రైతు .. ఎందుకంటే

దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది వరుడికి. చేసింది తప్పు అనుకున్నాడో లేదా ఎదురుతిరిగితే మరొకటి ఇస్తుందనుకున్నాడో గానీ చెంప ఛెళ్లుమన్నా కిక్కురుమనలేదు. నోరు మూసుకుని పెళ్లిపీటల మీద నుంచి లేచి నోట్లోని గుట్కాను పక్కన ఉమ్మాడు. వరుడిని చూసిన అక్కడి అమ్మాయిలంతా పగలబడి నవ్వినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాపం పెళ్లి పీటలమీదనే దెబ్బలుతిన్నాడంటే ఇక వాడి జీవితమంతా అంతేనేమో అంటున్నారు. మూడుముళ్లూ వేయకముందే చెంపదెబ్బ తిన్నాడంటే పెళ్లయ్యాక పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niranjan Mahapatra (@official_viralclips)