Birds : పక్షుల గుంపులు ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో తెలుసా?

పక్షులు గుంపులుగా ఎరిగేటప్పుడు వి ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి..? దీని వెనుక కారణమేంటి...ప్రపంచంలో అన్ని పక్షలు ఇదే విధానాన్ని ఎందుకు పాటిస్తున్నాయి...దీనికి కారణం ఏంటీ..?

Birds : పక్షుల గుంపులు ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో తెలుసా?

birds fly in v shape

birds fly in v shape : ఆకాశంలో పక్షులు ఎగరటం చూస్తే మనిషిలో ఒత్తిడి పోతుందని మానిసిక నిపుణులు సూచిస్తుంటారు. పక్షులు గాల్లో ఎగురుతుంటే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. పక్షుల్లా అలా గాల్లో ఎగిరిపోతుంటే ఎంత బాగుంటుంది మనకు కూడా రెక్కలుంటే బాగుండు మనం కూడా చక్కగా వాటిలో ఎగిరిపోవచ్చు అని అనుకుంటుంటాం. ఈ ప్రకృతిలో చిన్నవి పెద్దవి..రంగుల రంగుల పక్షులు ఉన్నాయి. ఒక్కో పక్షి జాతిది ఒక్కో ప్రత్యేకత. ఇలా పక్షుల గురించి చెప్పుకుంటుపోతే ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. అలా పక్షుల గురించి చెప్పుకోవాలంటే ఓ విశేషం గురించి చెప్పుకుని తీరాల్సిందే.

గాల్లో పక్షులు గుంపులు గుంపులుగా ఎగరటం చూసినప్పుడు ఓ ప్రత్యేకత గమనించారా..? పక్షులు గుంపులుగా ఎగిరేటప్పుడు ‘V’ ఆకారంలో ఎగురుతుంటాయి. అలా ‘V’ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి..? అని ఎప్పుడైనా ఆలోచించారా..?దీని వెనుక ఓ ప్రత్యేక కారణముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Blind Village : ఆ ఊర్లో మనుషులు, జంతువులకూ కంటిచూపు ఉండదు.. అంతా అంధులే..

పక్షుల్లో బెస్ట్ క్వాలిటీస్..
మనం పొద్దున్న లేస్తే టైమ్ చూసుకుంటాం. ఆ టైమ్ ప్రకారం మన పనులు చేసుకుంటాం. కానీ పక్షులకు టైమ్ చూసుకోవాల్సిన అసవరంలేదు. వాటి దినచర్య అంతా ఓ టైమ్ ప్రకారం జరిగిపోతుంటుంది. సూర్యోదయం కాకుండానే నిద్రలేస్తాయి. ఆహారం కోసం గూడి విడిచి బయటకెళ్లిపోతాయి. చీకటి పడకుండానే తిరిగి గూటికి చేరుకుంటాయి. ఇలా పక్షుల్లో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. అటువంటిదే ఈ ‘V’ ఆకారంలో ఎగరటంకూడా.

పక్షులు ఆహారం కోసం లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడో అవి ‘వి’ ఆకారంలో ఏర్పడి ఎగురుతుంటాయి. దానికి కారణం V ఆకారంలో ఎగిరితే పక్షులు సులభంగా ఎగరగలవు. గాలి ఒత్తిడి వాటికి ఇబ్బంది కలిగించదు. వాటి రెక్కల నిర్మాణాన్ని బట్టి చూస్తే ఆ షేపు వాటికి చక్కటి కంఫర్ట్ నిస్తుంది. అంతేకాదు సహచర పక్షులతో అవి ఢీకొట్టకుండా ఉండేందు ఈ V ఆకారం చక్కగా ఉపకరిస్తుంది. అలాగే మరో కారణం కూడా ఉంది. గుంపుకు  నాయకత్వం వహించే పక్షి నిర్ణయమే మిగతా పక్షులు అనుసరిస్తాయి. దీంట్లో ఏమీ బేధాభిప్రాయాలు ఉండవు మనుషుల్లోలాగా..పక్షులు గుంపుగా ఎగురుతున్నప్పుడు ఆ నాయకుడు ముందుంటాడు. దాని పక్కమ్మటా ఇతర పక్షులు ఎగురుతాయి. మరికొన్ని పక్షులు వెనుక ఎగురుతుంటాయి. వాటి క్రమశిక్షణ అది.

ముందు వెళ్లే నాయక పక్షి వేగాన్ని బట్టి మిగతా పక్షులు ఫాలో అవుతుంటాయి. నాయక పక్షి దిశానిర్ధేశంతో మిగతా పక్షులు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో పయనిస్తాయని..దాని వల్ల వాటి శక్తి తగ్గిపోకుండా ఉంటుందని తెలిపారు శాస్త్రవేత్తలు. బహుశా మనుషులు కూడా పక్షుల్ని చూసే విమానాల విన్యాసాలను ఫాలో అవున్నారేమో. కాగా.. స్క్వాడ్రన్ విమానాలు V ఆకారంలో ప్రయాణించడం వల్ల ఇంధన ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు..ఇలా V ఆకారంలో ఎగటం వల్ల గాలి వేగాన్ని అవి నియంత్రిగలుగుతాయట. వాటి శక్తిని ఆదా చేసుకుంటాయట.

Near Death Experience: ఆత్మలు ఉన్నాయి,మరణం తరువాత మరో జీవితం ఉంది : రుజువులున్నాయంటున్న అమెరికా డాక్టర్

పక్షులు ఎగిరే విషయంలో తమ శక్తిని చక్కగా వినియోగించుకుంటాయి. ఇవి ఏ ఆకారంలో ఎగిరినా వాటిశక్తిని వాటికి అనుగుణంగా వినియోగించుకోవటం వాటి ప్రత్యేకత. పక్షులు V ఆకారంలోనే కాదు, జే ఆకారంలో కూడా ఎగురుతుంటాయి.అలాగే కొన్ని పక్షులు రివర్స్ కూడా ఎగురుతుంటాయి. మరి మనుషుల కంటే పక్షులు స్మార్టే కదా.. పక్షులు V ఆకారంలో ఎగరడానికి కారణం ఎలా చూసుకున్నా అవి స్మార్ట్ గా ఆలోచించడమేగా కనిపిస్తోంది. కాగా పక్షుల గురించి మరో ముఖ్య విషయం ఎట్టి పరిస్థితుల్లో అయినా గుంపులో దిశానిర్ధేశం చేసే పక్షి అలసిపోతే దాని స్థానంలోకి మరో పక్షి వస్తుంది. ఇలా పక్షులు ఈజీ, కంఫర్ట్, డిపిప్లీన్ లతో వ్యవహరిస్తుంటాయి.