Nita Ambani Ganpati Celebrations : అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు, చీరల్లో మెరిసిపోయిన నీతా అంబానీ,ఇద్దరు కోడళ్లు
అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. ముంబైలోని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలా నివసమైన ఆంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి.

Ganpati celebrations In Ambani House
Ganpati celebrations In Ambani House : అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. అంబానీ ఇంట ఏం వేడుక జరిగినా వారి స్థాయికి తగినట్లుగా దర్పంగానే ఉంటుంది. ముంబైలోని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలా నివసమైన ఆంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి. ఈ వేడుకలకు షారూఖ్ ఖాన్(Shah Rukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), దీపికా పదుకొనే(Deepika Padukone),జాన్వీ కపూర్(Janhvi Kapoor)లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ముఖేష్ అంబానీ (Mukesh ambani)భార్య నీతా అంబానీ (Nita Ambani)సెప్టెంబరు 19న వారి ముంబై నివాసంలో గణేష్ చతుర్థిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నీతా అంబానీ తన పెద్ద కోడలు శ్లోకా మెహతా(Shloka Mehta ), చిన్నకోడలు (కాబోయే కోడలు) రాధిక మర్చంట్ (Radhika Merchant)లతో కలిసి వినాయక చవితి వేడులు జరుపుకున్నారు. నీతా అంబానీ తన రెండు వైపులా ఇద్దరు కోడళ్లతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో వారు ధరించి దస్తులు, ఆభరణాలు వైరల్ గా మారాయి. తోడికోడళ్లు ఇద్దరు మధ్యలో అత్తగారి నీతా అంబానీతో కలిసి ఉన్న ఫోటోలో నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.
నీతా అంబానీ ఆకుపచ్చ రంగు చీరకు ఎరుపు బార్డర్ కలిగిన పైథానీ సిల్క్ చీరకు తగిన డైమండ్ ఆభరణలతో తనదైన శైలిలో ధగ ధగా మెరిసిపోయారు. ఇక పెద్ద కోడలు శ్లోకా మెహత కూడా సంప్రదాయంగా లైమ్ గ్రీన్ సిల్క్ చీరపై పచ్చల ఆభరణాలు ధరించగా నీతా అంబానీ కాబోయే చిన్నకోడలు రాధికా మర్చంట్ కూడా పాస్టెల్ హ్యూడ్ చీరపై డైమండ్ సెట్ తో మెరిసిపోయారు.ఈ వినాయక చవితి వేడుకల్లో నీతా అంబానీ తన పెద్ద కోడలు శ్లోకా మెహతా, కాబోయే చిన్నకోడలు రాధికా మర్చంట్ లతో కలిసి ఉన్న ఫోటోలు సెంటారాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.