Dog Barking : రైల్వే స్టేషన్‌లో కుక్కలా మొరిగిన వందలాదిమంది .. ఎందుకంటే..?

ఏంటో బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు..పెద్దలు ఏమాటా ఊరికే అనరు. దానికి నిదర్శనమే మనుషులంతా కుక్కల్లా మారిపోయారు. కుక్కల్లా మొరిగారు.వందలాదిమంది కుక్కల్లా మొరిగితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dog Barking : రైల్వే స్టేషన్‌లో కుక్కలా మొరిగిన వందలాదిమంది .. ఎందుకంటే..?

people Dog Barking

Updated On : September 28, 2023 / 3:12 PM IST

Hundreds of people dogs gather to bark : వీధిలో ఒక కుక్క మొరిగితేనే వామ్మో ఏంటిది ఇలా అరుస్తోంది అంటూ కొట్టి తరిమేస్తాం. అదే 1000కుక్కలు ఒకేసారి అరిస్తే ఎలా ఉంటుంది..? ఏంటీ కుక్కల గోలరా బాబు అని చెవులు మూసుకుంటాం. కానీ మనుషులే కుక్కల్లా అరిస్తే ఎలా ఉంటుంది..? అది కూడా 1000మంది ఒకేచోట చేరి కుక్కల్లా అరిస్తే ఎలా ఉంటుంది..? అయినా మనుషులు ఎందుకు కుక్కల్లా అరుస్తారు..పైగా అంతమంది ఒకేచోట చేరి ఎందుకలా అరుస్తారు..? అని అనుకుంటున్నారా..?నిజమే ఏదో ఒకరో ఇద్దరు సరదాగా అరిచారు అంటే అది పెద్ద విషయం కాదు. కానీ 1000మంది ఒకేచోట చేరి కుక్కల్లా మొరిగారు అంటే వింతే మరి..అందుకే అది వైరల్ అవుతోంది.

Strange Creature : ఇసుకలో వేగంగా ఈదే వింత జీవి .. భూమిలోనే జీవితం

బెర్లిన్‌(central Berlin)లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్ ( Potsamer Platz railroad station) రైల్వే స్టేషన్‌లో 1000మంది చేరి కుక్కల్లా మొరిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారంతా కుక్కల్లాగా మొరుగుతో అటువైపు వచ్చిపోయేవారితో ‘కుక్క భాష’లో మాట్లాడారు. ‘డైలీ మెయిల్’ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ వెలుపల సామూహికంగా కుక్కల్లా మొరిగిన వ్యక్తులను ట్రాన్స్-స్పెసీస్ అని అంటారు. వీరు తమను తాము కుక్కలుగా భావిస్తుంటామని తెలిపారు..ఏంటో బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు..