Kerala : మారుతి 800 కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేసిన యువకుడు..!

నైపుణ్యం ఉంటే సాధారణ కారుని కూడా లగ్జరీ కారుగా..ఖరీదైన కారుగా మార్చేయొచ్చని చేసి చూపించాడో ఓ యువకుడు. మారుతి 800 కారును ఏఖంగా రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు.

Kerala : మారుతి 800 కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేసిన యువకుడు..!

Kerala Hadif Maruti 800 into 'Rolls Royce

Kerala Hadif Maruti 800 into ‘Rolls Royce’: నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని ఎంతోమంది నిరూపించారు. టాటా నానో కారుని హెలికాప్టర్ గా మార్చిన ఓ కార్పెంటర్ ప్రతిభ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూశాం. హెలికాప్టర్ నడపాలనే అతని కలను అలా నెరవేర్చుకున్నాడో ఆ కార్పెంటర్. లగ్జరీ కారు కొనుక్కోవాలని ప్రతీ సామాన్యుడికి ఉంటుంది. కానీ దానికి తగిన ఆర్థిక స్తోమత ఉండదు. కానీ చేతిలో నైపుణ్యం ఉంటే సాధారణ కారుని కూడా లగ్జరీ కారుగా..ఖరీదైన కారుగా మార్చేయొచ్చని చేసి చూపించాడో ఓ యువకుడు.

మారుతి 800 కారును ఏఖంగా రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు కేరళకు చెందిన ఓ యువకుడు.మారుతి కారు అంటూ 800 కాకు అంటేమధ్యతరగతి ప్రజల వాహనం.. అటువంటి వాహనాన్ని ఏకంగా రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు కేరళకు చెందిన హదీఫ్ అనే యువకుడు. రోల్స్ రాయిస్ అంటే శ్రీమంతులు మాత్రమే కొనుక్కోగలిగిన కారు. కానీ సామాన్యుల మారుతి కారును సంపన్నుల రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు తన ప్రతిభతో హదీఫ్.

Blue Whale : ఆ భారీ తిమింగలం పేలిపోతుంది దగ్గరకెళ్లొద్దని హెచ్చరిక

హదీఫ్ వయస్సు 18 ఏళ్లు. ఆటోమొబైల్ లో మంచి పట్టున్న కుర్రాడు. అతనికి ఖరీదైన కార్లంటే చాలా చాలా ఇష్టం. కానీ కొనుక్కునేంత ఆర్థిక స్థోమతలేదు. కానీ తనకున్న ప్రతిభతో తన కల నెరవేర్చుకోవాలనకున్నాడు. కొత్తగా ఆలోచించాడు. కష్టపడ్డాడు. అతనికి కష్టానికి ప్రతిఫలంగా రూ.45 వేల ఖర్చుతో మారుతి 800 కారును రోల్స్ రాయిస్ లా మార్చేశాడు. అంతే చూసేవారంతా వావ్ అన్నారు. నైపుణ్యం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించిన హదీఫ్ ను అందరు ప్రశంసించారు.

పాత రోల్స్ రాయిస్ కార్ల విడిభాగాలు సేకరించి..మారుతి 800 కారుకు హంగులు అద్దాడు. మొత్తం సెటప్ మార్చేశాడు. బాడీ హెడ్ లైట్ల నుంచి లుక్ మొత్తం రోల్స్ రాయిస్ కారుగా మార్చటానికి తనదైన శైలిలో డిజైన్ చేసాడు. కొత్త బాడీతో అచ్చంగా రోల్స్ రాయిస్ కారు లుక్ తెచ్చాడు. అతని దానికోసం నెలల తరబడి కష్టడపడ్డాడు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మారుతి 800 కారును ఏకంగా రోల్స్ రాయిస్ లా మార్చేశాడు. ఆ కారులో దర్జాగా చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.