Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు లీటరు రూ. 18లక్షలట..!!

ఒంటెపాలు, గాడిద పాలను మించి ‘ఎలుక పాలు’ ధర ఉంది. ఎలుకపాలు ఏంటీ.. అసలు ఎలుకే చిన్నగా ఉంటుంది..దాని పాలు సేకరణ ఎలా..? అసలు ఎలుక పాలు ఎందుకు ఉపయోగిస్తారు..?

Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు లీటరు రూ. 18లక్షలట..!!

Mouse Milk most expensive

Updated On : October 10, 2023 / 12:24 PM IST

Mouse Milk most expensive : ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీయో లేదా టీయో గొంతులో పడాల్సిందే.దాని కోసం పొద్దు పొద్దున్నే లేవగానే గుమ్మం దగ్గర పాల ప్యాకెట్ కోసం చూస్తాం. గేదె పాలు, ఆవు పాలు ఇలా ఏదోక పాలు ఉపయోగిస్తుంటాం. కానీ కేవలం గేదె పాలు, ఆవుపాలే కాదు మేకపాలు కూడా వినియోగిస్తుంటారు. ఇలా పాలు అంటే మన వినియోగంలో గేదె, ఆవుపాలే ఉంటుంటాయి. కానీ ఇప్పుడలా కాదు పోషకాల పాలు అంటూ ఒంటెపాలు, గాడిద పాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ పాలల్లో పోషకాలు ఎక్కువుంటాయట. దీంతో ఈ పాలకు డిమాండ్ పెరిగింది. ఏకంగా వేల రూపాయల ఖరీదుతో ఒంటె, గాడిద పాలు అమ్మకాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

కానీ ఒంటెపాలు, గాడిద పాలే కాస్త ఆశ్చర్యమనుకుంటే తాజాగా ‘ఎలుక పాలు’ కూడా వీటి ధరను మించి ఉంది. అంటే అంతకు మించి అన్నట్లుగా ‘ఎలుక పాలు’ ధర ఉంది. ఎలుకపాలు ఏంటీ.. అసలు ఎలుకే చిన్నగా ఉంటుంది..దాని పాలు సేకరణ ఎలా..? అసలు ఎలుక పాలు ఎందుకు ఉపయోగిస్తారు..? అనే పెద్ద పెద్ద డౌట్లు వచ్చి తీరుతాయి. మరి ఆ ‘ఎలుక పాలు’ వింత ఏంటో..దేనికి వినియోగిస్తారో తెలుసుకుందాం.. ‘ఎలుక పాలు’ధర వింటే కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే.

ఎందుకంటే లీటరు ఎలుక పాలు 23 వేల యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 18లక్షలు..!! ఏంటీ దిమ్మతిరిగిందా..? అంతేమరి రేటు ఆ రేంజ్ లోఉంది. రూ.18 లక్షలు పెడితే సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు.ఓ మంచి వ్యాపారం పెట్టుకోవచ్చు. మూడు కిలోలకు పైగా బంగారం కొనుక్కోవచ్చు. ఇలా రూ.18లక్షలు అంటూ చిన్నమొత్తం కాదు.అటువంటిది ఓ చిన్నప్రాణి పాలు రూ.18 లక్షలు అంటే ఆమాత్రం ఆశ్చర్యం ఉండదా ఏంటీ..? ఎందుకంటే ఎలుక చిన్న ప్రాణి పిల్లలు పెట్టాక దాని శరీరంలో పాలు శాతం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మరి లీటర్ ఎలుక పాలు సేకరించాలంటే మాటలు కాదు..లీటరు ఎలుక పాలు సేకరించాలంటే 40 వేల ఎలుకలు కావాల్సి ఉంటుందట..!

Bathukamma 2023 : బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం, రమణీయమైన పూలలో ఔషధ గుణాలు

ఇంతకీ ఈ ఎలుక పాలు దేనికి ఉపయోగిస్తారు..? ఎందుకు..? అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎలుక పాలను పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఏ పరిశోధనలు చేసినా సైంటిస్టులు, ఎలుకలు, కోతులు, పందులు, రేబిట్స్ వంటి జంతువులపై చేస్తుంటారు. కానీ ఎలుక పాలు సైంటిస్టులు పరిశోధనల కోసం వాడుతున్నారట. ఒక్క లీటరు పాలు కావాలంటే 40 వేల ఎలుకు అవసరం పడతాయట..

ఎలుక పాలను మలేరియా బాక్టీరియాను చంపే మెడిసిన్స్ కు ఉపయోగిస్తారట. శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఎలుకల పాలను వాడతారు. గేదె పాల కంటే ఆవు పాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.కానీ ఆవు పాల కంటే ఎలుక పాలలో నాలుగు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయట. అందుకే శాస్త్రవేత్తలు ఆవుపాల కంటే ఎలుక పాలను పరిశోధనల కోసం వాడుతున్నారట.

దీనికి కూడా ఓ కారణముంది. ఎలుక DNA ఇతర జంతువుల DNA కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మానవ శరీరానికి సంబంధించినది. ప్రయోగం చేయటానికి ఆ ఫలితాలను ఎనలైజ్ చేయటానికి వారికి ఈజీ అవుతుందట. ఎలుక పాలు మలేరియాను నివారించటానికి..పరిశోధనా సామగ్రిని తయారు చేయడానికి జన్యుపరంగా వాడతారు. కాబట్టి ఎలుకల పాలు చాలా ఖరీదైనవని పరిశోధనల్లో తేలింది..ఎలుక పాలు ధర సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది..