Odisha : ఊర్మిళకు మళ్లీ పెళ్లి.. 19 ఏళ్లకు తిరిగొచ్చిన భార్యకు అతను ఇచ్చిన అరుదైన గౌరవం
సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో 2004 విషాదాన్ని నింపింది. 19 ఏళ్ల తరువాత భార్య రూపంలో మళ్లీ ఆ సంతోషం తిరిగి వచ్చింది. భార్యను మళ్లీ పెళ్లి చేసుకుని అతను అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు.

Odisha Couples Basant..Urmila Parida remarry
Odisha Couples Basant..Urmila Parida remarry : ఊర్మిళ మళ్లీ పెళ్లి చేసుకుంది. తన భర్తనే మరోసారి పెళ్లి చేసుకుంది. 19 ఏళ్ల తరువాత భార్యను మరోసారి వివాహం చేసుకున్నాడు భర్త. దీంతో భర్త తనపై చూపిన నమ్మకానికి..ప్రేమకు చలించింపోయిందామె. ఇంతకీ భార్యనే ఎందుకు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సాధారణంగా ఇటువంటిది సష్టిపూర్తి సందర్భంగా జరుగుతుంటాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం తన వివాహం అయిన 19 ఏళ్లకు మరోసారి భార్య మెడలో పూల మాల వేసి నుదుటిన బొట్టు పెట్టి వివాహం చేసుకున్నాడు. పిల్లలే దగ్గరుండి మరీ అమ్మానాన్నలకు పెళ్లి చేసిన ఘటన ఒడిశాలో జరిగింది. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే..
ఒడిశా(Odisha)లోని కటక్ జిల్లా( Cuttack District)లో భబ్‌చంద్‌పుర్ గ్రామం(Bhabchandpur Village)లో బసంత్ పరిదా(Basant Parida), ఊర్మిళ పరిదా (Urmila Parida)భార్యాభర్తలు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వీరి సంసారం సంతోషంగా సాగిపోతోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటున్నారు. అన్నీ సాఫీగా జరిగితే బసంత్ దంపతులు మరోసారి పెళ్లి చేసుకోవాల్సిందికాదు. సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో 2004 ఓ విషాదాన్ని నింపింది. మేనల్లుడి ఇంటికి వెళ్తానని బయలుదేరిన ఊర్మిళ మతిస్థిమితం కోల్పోయింది. ఇంటికి వెళ్లే దారి మర్చిపోయింది. అలా ఎటో వెళ్లిపోయింది. భార్య కోసం బసంత్ పరిదా చాలాచోట్ల వెదికాడు. కానీ దొరకలేదు. ఆచూకీ లభించలేదు. అలా ఊర్మిళ ఇంటినుంచి వెళ్లి 19 ఏళ్లు గడిచిపోయింది. కానీ బసంత్ పరిదా భార్య వస్తుందనే నమ్మకంతోనే ఉన్నాడు. అలా ఆమె కోసం గాలిస్తునే ఉన్నాడు. అయినా ఫలితం లేకపోయింది.
Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ
కానీ సోషల్ మీడియా పుణ్యమాని 19 ఏళ్ల తరువాత ఊర్మిళ ఆచూకీ దొరికింది. తిగిరా పట్టణంలోని ఓ ఏటీఎం వద్ద నిస్సహాయ స్థితిలో ఉన్న ఊర్మిళను చూసిన ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేయటంతో ఆమె ఆచూకి దొరికింది. ఆ వీడియో చూసిన జిల్లా కలెక్టర్ ఆమెను శ్రీ మందిర్ సేవాశ్రమానికి చేర్చారు. అక్కడే ఆమెకు చికిత్స అందించారు. దాదాపు రెండు నెలలు చికిత్స తరువాత ఊర్మిళ కోలుకుంది. గతం గుర్తుకొచ్చింది. తన భర్తా, పిల్లలు ఎలా ఉన్నారోనని ఆందోళన చెందింది.
దాంతో అక్కడ ఉండలేకపోయింది. విషయం ఆశ్రమం నిర్వాహకులకు చెప్పి గత సోమవారం (జులై 3,2023) ఇంటికి తిరిగి వచ్చింది. పిల్లలు పెద్దవాళ్లైపోయారు. వారిని చూసిన ఊర్మిళ ఆనందం అంతా ఇంతాకాదు. ఇక భర్తను చూసి కన్నీరు పెట్టుకుంది. బసంత్ ఇంటికి తిరిగి వచ్చిన భార్యను అక్కున చేర్చుకున్నాడు. ఊర్మిళ నుదుట బొట్టు పెట్టి, పూలమాల వేసి మళ్లీ వివాహం చేసుకుని స్వాగతించాడు.