Naga Panchami 2023 : నాగుల పంచమి రోజున నట్టింటో నిజమైన నాగుపాముకు పూజలు ..
నాగ పంచమి పండుగ రోజున నట్టింట్లో నిజమైన నాగుపాముకు పూజ చేసిన వ్యక్తి. పగడవిప్పే నాగుపామును పూజగదిలో ఓ పళ్లెంలో పెట్టి దానికి పూలతో పూజలు చేసి హారతి ఇచ్చి పాలు నైవేద్యంగా పెట్టి చేయాల్సిన పూజల్నీ చేసారు. ఆ తరువాత ఆ పాముని ఏం చేశారంటే..

puja to real cobra on naga panchami
Man real cobra puja naga panchami : నాగుల చవితి, నాగ పంచమి పండులకు భక్తులు పూజలు చేయటం చూస్తుంటాం. పాముల పుట్టలు ఉండే చోటికి వెళ్లి పామలు పోసి గుడ్లు పెట్టి పూజలు చేసి వస్తుంటారు. కానీ సోమవారం (ఆగస్టు 21,2023) నాగుల చవిత పండుగ రోజున కర్ణాటకలో ఓ కుటుంబం మాత్రం పాముల పుట్టలో పాము ఉందో లేదో తెలికుండా పాముకు పూజలు చేయటం ఏంటీ అనుకున్నారో ఏమోగానీ నిజమైన నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి మరీ పూజలు చేశారు. పగడవిప్పే నాగుపామును పూజగదిలో ఓ పళ్లెంలో పెట్టి దానికి పూలతో పూజలు చేసి హారతి ఇచ్చి పాలు నైవేద్యంగా పెట్టి చేయాల్సిన పూజల్నీ చేసి తిరిగి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.
కర్ణాటకలోనే ఉత్తర కన్నడ జిల్లాలో సిరాసీలోని ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి పాములంటే చాలా ఇష్టం. నాగుల పంచమి పండగను పురస్కరించుకుని నిజమైన పాముకే పూజలు చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ నాగుపాముని ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి పాముకు పూజలు చేశాడు. పిల్లలు ఇద్దరు పదేళ్ల లోపు వారే. వారు కూడా ఏమాత్రం భయం లేకుండా పాముకు పువ్వులతో పూజలు చేశారు. హారతి ఇచ్చారు. పాలు నైవేద్యంగా పెట్టారు. పూజలు చేయటం పూర్తి అయ్యాక ప్రశాంత్ హులేకల్ పామును తీసుకెళ్లి జాగ్రత్తగా అడవిలో వదిలేశాడు.
తమకు పాములంటే ఇష్టమని పాముల సంరక్షణ కోసం కృషి చేస్తుంటామని తెలిపాడు ప్రశాంత్ హులేక్. అతని తండ్రి సురేశ్ కూడా పాముల సంరక్షణకు పాటుపడేవారట. పాముల పండుగ వస్తే తాము ప్రతీ సంవత్సం ఇలా పాముని తీసుకొచ్చి పూజలు చేసి దాన్ని జాగ్రత్తగా అడవిలో వదిలేయటం చేస్తున్నామని తెలిపాడు. తండ్రి నుంచి వారసత్వంగా ఇలా చేయటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపాడు.
ప్రశాంత్ తండ్రి సురేశ్ మరణించిన తరువాత ఆయన ముగ్గుకు కుమారులు, ప్రశాంత్, ప్రకాశ్, ప్రణవ్ లు ఇలా నిజమైన పాముల సంరక్షణకు పాటుపడుతున్నారట. తండ్రిలానే తాము కూడా పాముల కోసం పాముల సంరక్షణ కోసం కృషి చేస్తున్నామని తెలిపాడు ప్రశాంత్. ఇలా పాముల పండుగ రోజున పాముని తీసుకొచ్చి పూజలు చేసి తిరిగి దాన్ని అంత్యంత జాగ్రత్తగా అడవిలో వదిలేయటం చేస్తున్నామని తెలిపారు. ఇలా పూజలు చేసే సమయంలో పాముల వల్ల తమ కుటుంబంలో ఎవ్వరికి ఎటువంటి హాని జరుగలేదని తెలిపారు.