Qatar Hospital : అమ్మ కడుపులో పిండం దశల్ని శిల్పాలుగా ఆవిష్కరించిన ఆస్పత్రి..

అండం పిండంగా ఫలదీకరణ చెంది బుజ్జాయిగా రూపాంతరం చెందే పరిణామక్రమం అంతా అద్భుతం. అటువంటి శిశువు పరిణామ క్రమాన్ని అద్భుతమైన శిల్పాలుగా మార్చి ప్రత్యక్షంగా ఆవిష్కరించింది ఓ ఆస్పత్రి. ఆ శిల్పాలను చూస్తే బిడ్డ పుట్టుక..పరిణామ క్రమం ఎంత గొప్పదో అద్భుతమో కళ్లకు కట్టినట్లుగా అర్థమవుతుంది.

Qatar Hospital : అమ్మ కడుపులో పిండం దశల్ని శిల్పాలుగా ఆవిష్కరించిన ఆస్పత్రి..

Miraculous Journey At Qatar Hospital

Updated On : August 7, 2023 / 12:27 PM IST

Qatar Hospital amazing sculptures : పిండానికి ఊపిరి పోసే అమ్మ గర్భం..అదో పవిత్రమైన లోకం. అమ్మ కడుపులో పిండంగా ఏర్పడి..బుజ్జాయిగా మారి ఈ భూమ్మీదకు వచ్చే క్రమంలో ఎన్నో దశలు..ఆ దశల్ని కళ్లకు కడుతోంది ఓ ఆస్పత్రి. అమ్మ కడుపులో పిండం దశల్ని అద్భుత శిల్పాలుగా రూపుదిద్ది దారి వెళ్ల వెళ్లేవారిని దృష్టిని కట్టిపడేస్తోంది. మానవదేహానికి ఓ రూపం ఏర్పడే క్రమంలో అమ్మ తన రక్తమాంసాల్ని బిడ్డకు పంచి ఇచ్చి రూపాన్నిస్తుంది.

పిండానికి ఊపిరి పోసే అమ్మ గర్భం ఈ సృష్టిలోనే అద్భుతం. ప్రతీ మహిళ శరీరం ఓ సూపర్ కంప్యూటర్ అన్నాడో ఓ శాస్త్రవేత్త. పిండం శిశువుగా రూపుదిద్దుకునే క్రమంలో మారే దశలు అత్యద్భుతం. పిండాన్ని బిడ్డగా మార్చే అమ్మ గర్భం ఓ సూపర్ పవర్ ఫుల్ కంప్యూటర్ అన్నాడు ఓ శాస్త్రవేత్త..నిజమే కదా..మగవాడి వీర్యం..మహిళ అండం కలిస్తే పుట్టే బిడ్డ..ఆ బిడ్డ పిండంగా మారే దశ..పిండం బిడ్డగా రూపాంతం చెందే దశలు నిజంగా అద్భుతమే. అటువంటి దశల్ని శిల్పాలుగా ఏర్పాటు చేసింది కతార్ లోని ఓ ఆస్పత్రి.

Mother Dating offer : 100 మందితో డేటింగ్ చేస్తే రూ.40లక్షలు ఇస్తానంటు కూతురికి తల్లి ఆఫర్

అండం పిండంగా ఫలదీకరణ చెంది బుజ్జాయిగా రూపాంతరం చెందే పరిణామక్రమం అంతా అద్భుతం. ఈ కంప్యూటర్ యుగలంలో స్కానింగ్‌లో ఇప్పుడు బిడ్డ కదలికను తల్లిదండ్రులు చూసుకోగలుగుతున్నారు. కానీ స్కానింగ్ లో కాదు ప్రత్యక్షంగా ఆపరిణామ క్రమాన్ని చూడాలంటే ఖతార్ వెళ్లాల్సిందే. అటువంటి అనుభూతినే కాదు దానికి సంబంధించిన అవగాహననూ అందరికి పంచాలనుకున్నారు ఖతార్‌లోని సిద్రా మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వాహకులు.

దాని కోసం అద్భుతమైన శిశుల నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అండం- వీర్యం కలిసి ఫలదీకరణ చెందడం మొదలు- తొమ్మిది నెలల్లో పిండం ఎదిగి నవజాత శిశువు భూమ్మీద కొచ్చేవరకూ..అన్ని అన్నిదశలన్నిటినీ కాంస్య విగ్రహాలుగా రూపొందించారు. వాటిని ఆ ఆసుపత్రి దారిపొడవునా ఏర్పాటు చేసి అటుగా వెళ్లే వారికి అమ్మ గర్భంలోని దశలన్నీ చూపుతున్నారు.వాటిని చూస్తే నిజంగానే అమ్మ గర్భం సూరపర్ డూపర్ కంప్యూటర్ అనే విషయం కళ్లకు కనిపిస్తుంది.