7 varala nagalu : ఏడు వారాల నగలు అంటే ఏమిటి? గ్రహాలకు, ఏడు వారాల నగలకు సంబంధమేంటీ..?

ఏడు వారాల నగలు అంటే ఏమిటి? ఏడు వారాలు ఏడు రంగుల నగలు ధరించటం వెనుక ఉన్న కారణమేంటీ..ఏడు రంగులకు..ఏడు వారాల నగలకు..గ్రహాలకు సంబంధమేంటి?..ఆ రంగులకు గ్రహాల ప్రభావానికి సంబంధమేంటి? ఏడు వారాల నగల గురించి ఆసక్తికర విషయాలు..

7 varala nagalu  : ఏడు వారాల నగలు అంటే ఏమిటి? గ్రహాలకు, ఏడు వారాల నగలకు సంబంధమేంటీ..?

seven weeks seven tyep jewelry specialty

Updated On : July 31, 2023 / 5:44 PM IST

Seven weeks jewelry : ఏడు వారాల నగలు. ఈ మాట వినటమే గానీ వీటి విశిష్టత…ఈ నగల రంగుల వెనుక గ్రహాల అనుగ్రహం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. రంగులకు గ్రహాలకు సంబంధం ఉందని ఆ ప్రకారమే ఈ ఏడు వారాల నగల వెనుక ఉన్న కారణాలు అని బహుశా చాలామందికి తెలియదు. ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు రోజులు… రోజుకు ఒక రంగు నగ..ఆ రంగుకు గ్రహాలకు ఉన్న సంబంధం ఆ ప్రభావం ఏంటీ..ఆ రంగుల నగలు ధరించటం వెనుక ఉండే ప్రయోజనాలు ఏంటీ అనే ఆసక్తికర విశేషాలేంటో చూసేద్దాం..

ఈ ఏడు వారాల నగలు గురించి వినటమే తప్ప పెద్దగా ఎవ్వరు చూసింది చూడా తక్కువమందే ఉంటారనే చెప్పాలి. ఏడు వారాల నగలు ఉన్నాయంటే వారు శ్రీమంతులనే అనుకుంటాం తప్ప వీటి వినియోగం..అవి రంగుల రూపంలో ధరిస్తారని..ఆ రంగుల వెనుక గ్రహాలు అంటూ సూర్యుడు, చంద్రుడు,బుధుడు, శుక్రుడు ఇలా పలు గ్రహాలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఏడు వారాలు అంటే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనిలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

వారాల వరుసను బట్టి నగల ధరించే ఆచారం..
ఆదివారం : సూర్యుడికి ఇష్టమైన రోజు. సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తాడు. కాబట్టి ఆదివారం కెంపుల కమ్మలు, హారాలు ధరించాలి..కెంపులు అంటే ఎర్రగా..గులాబీ రంగుల్లో ఉంటాయి. సిగ్గు పడే అమ్మాయి బుగ్గలను కవులు కెంపులతో పోలుస్తారు..

సోమ వారం : సోమవారం అంటే సోముడు అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు..చంద్రుడు అంటే తెలుపు. తెల్లని వెన్నెలను కురిపించే చంద్రుడికి ఇష్టమైనది తెలుపు. కాబట్టి ఆదివారం తెల్లగా ఉండే ముత్యాలతో తయారు చేసిన నగలను ధరిస్తారు. ముత్యాల హారం, ముత్యాల గాజులు, కమ్మలు,ఉంగరం లాంటి నగలు ధరించాలి.

మంగళ వారం : ఈ వారం కుజుడికి ఇష్టమైన రోజు. అంటే కుజుడుకి ఇష్టమైన పగడాల దండలు,పగడాలతో చేసిన హారాలు, గాజులు,ఉంగరాలు ధరించాలి.

బుధ వారం : బుధవారం అంటే బుధుడు. బుధునికి ఇష్టమైన పచ్చలతో చేసిన పతకాలు, గాజులు, ఉంగరాలు వంటి నగలు ధరించాలి.

గురు వారం : గురువారం అంటే దేవతల గురువు బృహస్పతికి ఇష్టమైన రోజు. కనక పుష్ప రాగపు కమ్మలూ, ఉంగరం ధరించాలి. ఇవి ధరిస్తే బుధుడి అనుగ్రహం పొందవచ్చు.

శుక్ర వారం : శుక్రవారం అంటే శుక్ర గ్రహం. శుక్రునికి ఇష్టమైన రోజు. వజ్రాల హారాలు,గాజులు, ఉంగరం, చెవి కమ్మలు ధరించాలి, మరీ ముఖ్యంగా వజ్రాల ముక్కుపుడక ధరించాలి. ధగధగా మెరిసే వజ్రాల ముక్కు పుడక ధరించి లక్ష్మీ దేవిలా దర్శనం ఇవ్వాలట. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఇక దేనికి లోటు ఉండదు.

శని వారం : శనికి ఇష్టమైన రంగు నలుపు అని చాలామంది అనుకుంటారు. కానీ శనికి ఇష్టమనైన రంగు నీలం. కాబట్టి నీలాల నగలు ధరించాలి. నీలం రంగు నగలు ధరిస్తే శని ప్రభావం పడదు. కానీ నీలం రంగు చాలా చాలా ప్రమాదమని అంటారు. కానీ కలిసి వచ్చేవారికి నీలం రంగు అంత అదృష్టం కూడా ఉండదంటారు.

ఇలా ఆయా వారం రోజున ఆయా రంగుల నగలు ధరిస్తే ఆ గ్రహాల నెగిటివిటీ పడకుండా పాజిటివ్ ప్రభావం ఉంటుందని అంటారు. అలా ఏడు వారాలకు ఏడు రంగుల నగలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. రంగులు ప్రభావాలు మనుష్యలుపైనా వారి ఆలోచనలపైనా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతుంటారు.

అందుకే కొన్ని చోట్ల కొన్ని రంగులు ప్రత్యేకతను సంతరించకుని ఉంటాయి.ఉదాహరణకు ఆస్పత్రుల్లో సర్జరీలు చేసే డాక్టర్లు ఆకుపచ్చ రంగు, నీలం రంగు దస్తులు ధరిస్తారు. ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు.