6 Months Boy Nobel World Record : ఆరు నెలల పసిపిల్లాడికి నోబెల్ వరల్డ్‌ రికార్డ్‌.. ఏం చేశాడో తెలుసా..?

ఆరు నెలల బుజ్జాయి మాత్రం ఏకంగా నోబెల్ వరల్డ్‌ రికార్డ్ రికార్డ్ సాధించాడు. ఇంత చిన్నపిల్లాడు ఏం చేశాడు?ఎలా ఈ అరుదైన రికార్డు సాధించాడు..?

6 Months Boy Nobel World Record : ఆరు నెలల పసిపిల్లాడికి నోబెల్ వరల్డ్‌ రికార్డ్‌.. ఏం చేశాడో తెలుసా..?

6 Months Boy Nobel World Record

Updated On : July 31, 2023 / 1:36 PM IST

Six months Old boy ‘Nobel World Record’ : ఆరు నెలల పసిపిల్లాడిని నోబెల్ వరల్డ్‌ రికార్డ్‌ వరించింది. ఆరు నెలల పసిపిల్లలు అంటే బొజ్జనిండా పాలు తాగి కంటినిండా నిద్రపోతారు. మెలకువగా ఉంటే ఉంగా ఉంగా అంటూ ఊసులు చెబుతారు. కానీ ఓ ఆరు నెలల బుజ్జాయి మాత్రం ఏకంగా నోబెల్ వరల్డ్‌ రికార్డ్ రికార్డ్ సాధించాడు. అదికూడా నోబెల్ వరల్డ్ రికార్డు(Nobel World Record). సరిగా మాటలు రావు..పాకటం తప్ప నడవలేని ఆరు నెలల పసిపిల్లాడు నోబెల్ వరల్డ్‌ రికార్డ్ వచ్చేలా ఏం చేశాడు..? అనే ఆసక్తి కలిగిందా..? మరి ఈ బుడ్డోడి ఘనత ఏంటో తెలుసుకుందాం..వీడు చేసిందేంటో తెలిస్తే బుడ్డోడే గానీ మహా ఘటికుడే అంటారు..

సాధారణంగా ఆరు నెలల పసిపిల్లలు అమ్మానాన్నల్ని గుర్తు పడతారు. కానీ ఏపీ (Andhra Pradesh)లోని కడప జిల్లా(Kadapa district)కు చెందిన ఆరు నెలల పిల్లాడు మాత్రం అమ్మచెప్పింది వింటాడు. ఇట్టే బుర్రలో ఫీడ్ చేసేసుకుంటాడు ఏదో కంప్యూటర్ లో సేవ్ చేసుకున్నట్లుగా..అందుకే ఆరు నెలలకే నోబెల్ వరల్డ్ రికార్డు మోత మోగించాడు కడప జిల్లా పొద్దుటూరు (Proddatur)బిడ్డడు. శాస్త్రి నగర్ కు చెందిన పవన్ కుమార్ (Pawan Kumar )సౌమ్యప్రియ (Soumyapriya)అనే దంపతులకు ముద్దుల కొడుకు ప్రజ్వల్(Prajwal). వయస్సు ఆరంటే ఆరు నెలలు.

UP Farmer Climbs Tree: పగబట్టిన ఎద్దు.. రెండు గంటలు చెట్టుపైనే రైతు.. వీడియో వైరల్.. అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర ట్వీట్

అమ్మ చెప్పేవన్నీ చెప్పేస్తుంటాడు. అంతేకాదు అమ్మ కొన్ని బొమ్మల్ని చూపించి వాటి పేర్లుచెబితే ఇట్టే గుర్తు పెట్టేసుకుంటాడు. వాటి పేర్లు చెప్పేస్తాడు. జంతువులు, పండ్లు, వాహనాలు, పక్షులు, కూరగాయలు, అంకెలు ఇలా ఫోటోల్ని చూపించి తల్లి వాటి ఫోటోలు చూపిస్తే టక్కున గుర్తుపెట్టేసుకుంటున్నాడు. దీంతో ప్రజ్వల్ తల్లి సౌమ్య తన పిల్లాడి టాలెంట్ చూసి మురిసిపోయింది. అంతేకాదు ప్రజ్వల్ వీడియో తీసి చిన్నారి వీడియోను తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్ (Nobel World Record)వారికి జులై 9న పంపించారు.

ఈ వీడియో చూసి స్పందించిన సంస్థ ప్రతినిధులు ఆ చిన్నారికి జులై 29న ఆన్ లైన్‌లో నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డును పంపించారు. ఆరు నెలలకే ఈ అవార్డు సాధించిన బుడతడి రికార్డు విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు.బుడ్డోడే గానీ గట్టోడే అంటున్నారు. ఇక ప్రజ్వల్ తల్లిదండ్రులు ఆందనం అంతా ఇంతా కాదు.