HongKong Sotheby’s Auction : చిన్న పింగాణీ గిన్నెరూ.205 కోట్లు, జగ్గు రూ.110 కోట్లు, ఇక ఓ పెయింటింగ్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!!
వస్తువులు చిన్నవే..కానీ వాటి ధరలు వింటే షాక్ అవ్వటం కాదు..నోటమ్మట మాట రావటానికి చాలా టైమ్ పడుతుంది. ఓ చిన్నపాటి పింగాణీ గిన్నె..మరో పింగాళి జగ్గు ధరలు వజ్రాల ధరలను మించి ఉన్నాయి. అలాగే మరో పెయటింద్ ధర వింటే కూడా ఇక అంతే సంగతులు..

HongKong Sotheby’s Auction
HongKong Sotheby’s Auction : వస్తువులు చిన్నవే..కానీ వాటి ధరలు వింటే షాక్ అవ్వటం కాదు..నోటమ్మట మాట రావటానికి చాలా టైమ్ పడుతుంది. ఓ చిన్నపాటి పింగాణీ గిన్నె..మరో పింగాళి జగ్గు ధరలు వజ్రాల ధరలను మించి ఉన్నాయి. ఓ పింగాణీ ధర మహా అయితే రూ.వందల్లో ఉండొచ్చు..ఇంకా అయితే రూ. వేలల్లో ఉండొచ్చు. కానీ ఇదిగో ఈ పింగాణీ గిన్నె ధర మాత్రం అక్షరాలు చిన్న పింగాణీ గిన్నె ధర రూ.205 కోట్లు..! మరో పింగాణీ జగ్గు ధర రూ.110 కోట్లు..! ఏంటీ ఇవేమన్నా బంగారాన్ని మిక్స్ చేసి తయారు చేశారా?అంటే అటువంటిదేమీ లేదు. అలాగే మరో పెయటింద్ ధర వింటే కూడా ఇక అంతే సంగతులు..సుమారు రూ.262 కోట్లకు అమ్ముడై షాకిచ్చింది.
హాంకాంగ్ లో నిర్వహించిన ప్రత్యేక వేలంలో ఓ చిన్నపాటి పింగాణీ గిన్నె, మరో పింగాణీ జగ్గు, ఇంకో పెయింటింగ్ కలిపి రూ.ఐదున్న కోట్లకు అమ్ముడై ఆశ్చర్యాన్ని కలిగించాయి. పింగాణీ వస్తువులకే ఇంత ధరా? అని ఆశ్చర్యపోతాం. కానీ ఏదో ప్రత్యేకత లేకపోతే ఇంత ధర ఉండదు కదా? అనికూడా అనిపిస్తుంది. నిజమే వీటి ప్రత్యేకతలు మామూలుగా లేవు..!
ప్రత్యేక కళాఖండాలు, వస్తువులను వేలం వేసే సోథిబే అనే సంస్థ ఆసియాలో ఆఫీసును ప్రారంభించి ఐదు దశాబ్దాలు (50 Years) పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ఓ ప్రత్యేక వేలాన్ని నిర్వహించింది. చైనాకు చెందిన అరుదైన కళాకృతులను వేలం వేసింది. ఈ వేలంలో 25 మిలియన్ డాలర్ల పైనే అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.205 కోట్లు ధర పలికిన చైనాకు చెందిన ఓ పింగాణీ గిన్నె 18వ శతాబ్దానికి చెందినది. 4.5 అంగుళాల గల ఈ పింగాణి గిన్నె దాదాపు 300 ఏళ్ల క్రితం 1722-35 మధ్య యోంగ్‌జింగ్ రాజు హయాంలో అరుదైన పింగాణీతో దీనిని తయారుచేసారి వేలం నిర్వహించిన సంస్థ సోథిబే వెల్లడించింది. ఈ అరుదైన పింగాణీ గిన్నెపై అంతకంటే అందమైన డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి దాన్ని ధరకు వన్నె తెచ్చిందనే చెప్పాలి.. ఈ గిన్నెపై ఎనామిల్‌తో రెండు పక్షులు, వికసిస్తున్న ఆప్రికాట్ చెట్టును చిత్రీకరించారు కళాకారులు. ఇది ఆనాటి కళకు అద్దంపడుతున్నట్లుగా ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదకుండా ఉంది.
UAE: వామ్మో.. ఈ సంఖ్య ఉన్న కారు నంబరు ప్లేటుకు రూ.123 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి.. ఎందుకంటే?
ఇలాంటి గిన్నెలను అప్పుడు రెండే రెండు గిన్నెలను తయారు చేశారట. వాటిని వేలం వేశారు. అలా 1929లో వీటిని 150 పౌండ్లకు వేర్వేరుగా అమ్ముడు అయ్యాయి. వీటిలో ఒకటి ఒకటి ప్రస్తుతం లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది..మరొక గిన్నెను హాంకాంగ్‌లో తాజాగా వేలం వేయగా ఈ గిన్నెకు 25.3 మిలియన్ డాలర్ల ధర లభించిందని సోథిబే సంస్థ తెలిపింది. కానీ నిబంధనల ప్రకారం ఇంత ఖరీదు పెట్టి వేలంలో దీన్ని ఎవరు దక్కించుకున్నారనే విషయాన్ని సదరు సంస్థ వెల్లడించలేదు.
హాకాంగ్ లో సోథిబే సంస్థ నిర్వహించిన ఈ ప్రత్యేక వేలంలో వాచ్ లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వింటేజ్ వైన్లు, ఇంకా చారిత్రక గుర్తింపు కలిగిన ఫ్లవర్ వాజ్ లతో పాటు ఇంకా పలు పురాతన వస్తువులను వేలం వేశారు. వీటిలో మింగ్ రాజవంశానికి చెందిన పింగాణీ వాటర్ జగ్గు 13.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.110 కోట్లు) పలికింది.
అలాగే ‘పికాసో ఆఫ్ ది ఈస్ట్’గా గుర్తింపు పొందిన చైనా కళాకారుడు జాంగ్ డకియాన్ చేతినుంచి జాలువారిన 1973 నాటి ఓ పెయింటింగ్ కూడా కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఆ పెయింటింగ్ ఏకంగా 32 మిలియన్ డాలర్ల (సుమారు రూ.262 కోట్లు)కు అమ్ముడైంది. ‘‘పింక్ లోటసెస్ ఆన్ గోల్డ్ స్క్రీన్’’ అనే పేరుతో ఉన్న ఈ పెయింటింగ్‌కు వేలంలో మంచి స్పందన వచ్చిందని సోథిబే వెల్లడించింది.