UAE: వామ్మో.. ఈ సంఖ్య ఉన్న కారు నంబరు ప్లేటుకు రూ.123 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి.. ఎందుకంటే?

Emirates Auction LLC సంస్థ తాజాగా కారు నంబరు ప్లేటుకు వేలం వేసింది. నంబరు ప్లేటులో మధ్యలో 7 సంఖ్య మాత్రమే కనపడుతుంది.

UAE: వామ్మో.. ఈ సంఖ్య ఉన్న కారు నంబరు ప్లేటుకు రూ.123 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి.. ఎందుకంటే?

UAE

UAE: కారు నంబరు ప్లేటుకు ఓ వ్యక్తి రూ.123 కోట్లు ఖర్చుపెట్టాడు. యూఏఈ (United Arab Emirates)లోని అతిపెద్ద నగరం దుబాయిలో P 7 నంబరు ప్లేటు ఆ ధరకు అమ్ముడుపోయింది. దీంతో, నంబరు ప్లేటు ధర విషయంలో (Most Expensive Number Plate) యూఏఈలో పదేళ్ల క్రితం నెలకొన్న రికార్డు బద్దలైంది.

ఎమిరేట్స్ ఆక్షన్ ఎల్ఎల్సీ (Emirates Auction LLC) సంస్థ తాజాగా కారు నంబరు ప్లేటుకు వేలం వేసింది. నంబరు ప్లేటులో మధ్యలో 7 సంఖ్య మాత్రమే కనపడుతుంది. దానికి ఎడమవైన కొన్ని సెంటీమీటర్ల దూరంలో పీ అక్షరం ఉంటుంది. సేవా కార్యక్రమానికి నిధుల కోసం ఈ వేలం వేసినట్లు ఎల్ఎల్సీ తెలిపింది.

యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రారంభించిన 1 Billion Meals Endowment (పేదలకు ఆహారం అందించే కార్యక్రమం)కు రూ.123 కోట్లు అందిస్తారు. యూఏఈలో ప్రత్యేకమైన నంబరు ప్లేట్ల వేలాన్ని నిర్వహిస్తుంటారు. ధనవంతులు సేవా కార్యక్రమాలకు నిధులు ఇవ్వడానికి, పేరు, ప్రఖ్యాతల కోసం ఇందులో పాల్గొంటారు. 2008లో 1 నంబరుతో ఉన్న నంబరు ప్లేటు రూ.116 కోట్లకు అమ్ముడుపోయింది.

అప్పట్లో సయీద్ అబ్దుల్ గఫార్ ఖౌరీ అనే వ్యాపారి ఈ వేలంలో నంబరు ప్లేటును దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఈ తాజా వేలంలో 7 సంఖ్యతో ఉన్న నంబరు ప్లేటు ఎవరికి దక్కిందనే విషయంపై నిర్వాహకులు వివరాలు తెలపలేదు. పలు దేశాల్లోనూ ప్రత్యేక నంబరు ప్లేట్ల కోసం ధనవంతులు అమితాసక్తి కనబర్చుతారు. హాంకాంగ్ లో కొన్ని నెలల క్రితమే “ఆర్” అక్షరం ఉన్న నంబరు ప్లేటు రూ.26 కోట్లకు అమ్ముడుపోయింది.

China : కోళ్లపై ఫ్లాష్‌ లైట్‌ కొట్టి చంపిన వ్యక్తికి జైలు శిక్ష