Tomato Prices : కిలో టమాటాలు రూ.80లకే విక్రయిస్తున్న రైతు సోదరులు ..

దేశ వ్యాప్తంగా టమాటాలు కిలో రూ.20 నుంచి రూ.250 అమ్ముతుంటే ఇద్దరు రైతు సోదరులు మాత్రం కిలో టమాటాలు రూ.80కే అమ్ముతున్నారు. టమాటా పంటవేసిన ఆ రైతు సోదరులను ఎంతోమంది అవహేళన చేసినవారే మార్కెట్ ధర కంటే తక్కువ అమ్ముతున్న వారిని అభినందిస్తున్నారు.

Tomato Prices : కిలో టమాటాలు రూ.80లకే విక్రయిస్తున్న రైతు సోదరులు ..

Tamil Nadu farmer brothers Tomato

Tamil Nadu Tomato Prices : దేశంలో హాట్ టాపిగ్ మారిన టమాటాల ధరలు హడలెత్తిస్తున్నాయి. కిలో రూ.250వరకు అమ్ముతున్నాయి. ఇవి కిలో రూ.300లకు చేరుతుందంటున్నారు వ్యాపారులు. దీంతో సామాన్యలు టమాటాలు అనే మాటే మర్చిపోయారు. గత రెండునెలల నుంచి టమాటాల ధరలు ఏమాత్రం తగ్గటంలేదు. దీంతో టమాటాల గురించ మీమ్స్..రీల్స్,వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా టమాటాలపై రీల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వ్యాపారులు టమాటాల ధరలను క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే మరికొంతమంది వ్యాపారులు టమాటాలు ఫ్రీ అంటూ కష్టమర్లను ఆకట్టుకుంటున్నారు.టమాటాలు ఫ్రీ అని ప్రకటన విన్నా..అదెక్కడో తెలిసినా జనాలు ఎగబడి మరీ వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలో ఇద్దరు సోదరులు కిలో టమాటాలను కిలో రూ.80లకే అమ్ముతు పెద్ద మనస్సు చాటుకుంటున్నారు. కిలో రూ. 200 పైనే ఉన్న టమాట ధరలు హడలెత్తిస్తుంటే ..టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. కానీ తమిళనాడులోమాత్రం ఇద్దరు సోదరులు మాత్రం కిలో టమాటాలు కేవలం రూ.80 కే విక్రయిస్తున్నారు.

Tomato pooja : ధరలు తగ్గించు తల్లీ .. టమాటాలతో అమ్మవారికి పూజలు,టమాటాలే నైవేద్యం..భక్తులకు అవే ప్రసాదం

తమిళనాడుకు చెందిన రామన్, పుట్టుస్వామి (Raman, Puttuswamy)అనే ఇద్దరు రైతు సోదరులు జనాల అవసరాన్ని క్యాష్ చేసుకోకుండా కిలో టమాటాలకు రూ.80కే అమ్ముతున్నారు. ఊటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి జిల్లాలోని కుందా గ్రామానికి చెందిన రామన్, పుట్టుస్వామి ఎన్నో ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నారు. ఎక్కువగా బంగాళదుంప, క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, వెల్లుల్లి పంటలను సాగు చేసే ఈ సోదరులు ఇద్దరు కూరగాయల పంటలో వారి ఇంటి అవసరాల కోసం మాత్రమే కొన్ని టమాటా మొక్కలు వేసి పండించేవారు.

కానీ ఈ ఏడాది టమాటా పంటను సాగు పెంచారు. అది అనుకోకుండా జరిగింది. దీంతో తోటి రైతులు, స్థానికులు ఎప్పుడు టమాటాలకు సరైన ధర ఉండదు ఎప్పుడు లేదని ఈ పంట వేస్తున్నారేంటి నష్టపోతారు అని అనేవారు. కానీ టైమ్ మారింది. టమాటాలకు గిరాకీ పెరిగింది. వారి పంట కూడా బాగా దిగుబడి వచ్చింది. టమాటాల ధరలు పెరగటంతో వారు కూడా తమ పంటను క్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడున్న టమాటాల ధరలను బట్టి. కానీ వారు అలా అనుకోలేదు. రామన్, పుట్టుస్వామి మాత్రం కిలో టమాటాలను కిలో రూ.80 కే అమ్ముతున్నారు. దీంతో స్థానికులంతా ఆ ఇద్దరు సోదరులను అభినందిస్తున్నారు. గతంలో ఆ ఇద్దరు సోదరులను టమాట పంట వేసినందుకు హేళన చేసినవారు ఇప్పుడు అభినందిస్తున్నారు.

కిలో టమాటాలు రూ.250ల వరకు డిమాండ్ ఉన్నా వారు మాత్రం రూ.80కే అమ్ముతున్నారు. దీనిపై ఆ సోదరులిద్దరు మాట్లాడుతు..తాము చిన్నప్పనుంచి వ్యవసాయంతోనే జీవిస్తున్నామని.. పురుగులు, చీడపీడల భయంతో టమాటా పంట వేయడాన్ని ఆపేశామని కానీ ఈసారి మాత్రం ఎలాగైనా టమాటా పండించాలని నిర్ణయించుకుని పంట వేసామని చెప్పుకొచ్చారు.తాము టామాటా పంట వేసినపుడు కిలో రూ. 10 మాత్రమే ఉండేదని..వాతావరణం సరిగా లేకపోవటం వల్ల ఎన్నో టమాట మొక్కలు దెబ్బతిన్నాయిన కానీ ఉన్న మొక్కలు పండి దిగుబడి తక్కువగానే వచ్చిందని తెలిపారు. కిలో రూ.80 కే విక్రయించడం వల్ల స్థానికంగా ఉండే గ్రామస్థులకు తక్కువ ధరలో టమాటాలను ఇస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు పుట్టుస్వామి, రామన్.. ఎలాంటి పురుగుమందులు లేకుండా సేంద్రీయ ఎరువులు వేసి పంట పండించామని తెలిపారు.

Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు

మార్కెట్ లో ఉన్నంత ధరకు తాము అమ్ముకుని డబ్బులు బాగానే సంపాదించొచ్చు. కానీ పోయిన పంట పోగా బతికిన మొక్కలకు కాసి టమాటాలను స్థానికులకే కిలో రూ.80కు అమ్ముతున్నామని తమకు ఖర్చులు వచ్చినా చాలని తెలిపారు. ఇప్పటివరకు 1,000 కిలోల కంటే ఎక్కువ టమాటాలను అమ్మాము అని తెలిపారు.