Makar Sankranti 2024: పిండి వంటలు చేసుకుంటున్నారా? చెక్కలు, నెలవంకలు ఇలా చేయండి..

సంక్రాంతి పండుగ సమయంలో చేసుకునేందుకు కొన్ని వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం... తయారీ విధానాన్ని చూద్దాం..

Makar Sankranti 2024: పిండి వంటలు చేసుకుంటున్నారా? చెక్కలు, నెలవంకలు ఇలా చేయండి..

Makar Sankranti 2024

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. పండుగ అంటే గుర్తుకొచ్చేది పిండి వంటలు. ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతోంది. బోలెడు వెరైటీలు నోరూరిస్తాయి. వంటలతో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. పిల్లాపాపలతో కేరింతలు కొడుతుంది. ప్రతి ఒక్కరి నోరు కొత్త రుచులు చూస్తుంది. సంక్రాంతి పండుగలో వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం… తయారీ విధానాన్ని చూద్దాం..

సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది పిండి వంటలు. ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతోంది. బోలెడు వెరైటీలు నోరూరిస్తాయి. వంటలతో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. పిల్లాపాపలతో కేరింతలు కొడుతుంది. ప్రతి ఒక్కరి నోరు కొత్త రుచులు చూస్తుంది. సంక్రాంతి పండుగలో వందల రకాల పిండి వంటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం… తయారీ విధానాన్ని చూద్దాం..

సగ్గుబియ్యం చెక్కలు 
ప్రతి ఒక్కరి ఇంట్లో వండే పిండి వంటల్లో కామన్ గా ఉండేవి చెక్కలు. వివిధ రకాల్లో వీటిని వండుతారు. ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కల తయారీని చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు 
బియ్యం నాలుగు కప్పులు, పెసరపప్పు రెండు కప్పులు, సగ్గుబియం కప్పు, నువ్వులు మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర స్పూను, వెన్న ఒక స్పూను, కారం, ఉప్పు రుచికి తగినంత, నూనె వేయించడానికి సరిపడా.

తయారీ విధానం
బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండి చేసుకోవాలి. అందులో నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, వెన్న వేసుకుని బాగా కలుపుతూ సరిపడా నీళ్ళు పోసుకుంటూ ముద్దలా చేసుకొవాలి. ఐదు నిమిషాల తరవాత ఈ పిండిని చిన్న చిన్న చెక్కల్లా ఆద్దుకుని వేడినూనెలో  బాగా వేగాక  తీసేస్తే సరిపోతుంది.

నెలవంకలు ఇలా..
నెలవంకలు అనగానే అందరికి మూన్ బిస్కేట్స్ గుర్తొస్తాయి. కానీ ఇంట్లో వండే పిండి వంటల్లో కూడా ఈ వెరైటి ఉంటుందని తెలియదు కదు. మరి అవి ఎలా చేస్తారో చూసేద్దామా.

కావాల్సిన పదార్థాలు
సెనగపప్పు ఒక కప్పు, బియ్యప్పిండి పావుకప్పు, పచ్చికొబ్బరితురుము పావుకప్పు, బెల్లంతురుము ఒక కప్పు, యాలకుల పొడి చెంచా, నూనె వెయించడానికి సరిపడా.

తయారీ విధానం
సెనగపప్పు ఉడకబెట్టి ముద్దలుగా చేసుకోవాలి. అందులో బియ్యప్పిండీ, పచ్చికొబ్బరితురుమూ కలుపుకోవాలి. దీన్ని కాస్త మందంగా చపాతీలా వత్తుకుని అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ వేడినూనెలో వేసుకుని బాగా వేగాక తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుమును మునిగేదాకా నీళ్ళు పోసుకుని తీగపాకం పట్టాలి. అందులో యాలకులపొడి వేసుకుని ముందుగా వేయించుకున్న నెలవంకల్ని అందులో వేసుకోవాలి. ఇనవై నిమిషాల తరవాత బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది.
Makar Sankranti 2024: సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?