Near Death Experience: ఆత్మలు ఉన్నాయి,మరణం తరువాత మరో జీవితం ఉంది : రుజువులున్నాయంటున్న అమెరికా డాక్టర్

మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది..? ఆత్మలు ఉన్నాయా..? ఆత్మ, పరమాత్మ, మనిషికి పునర్జన్మ..ఇవన్నీ ఏంటీ..? మరణం అంచుల వరకు వెళ్లి వచ్చినవారు వీటి గురించి ఏం చెబుతున్నారు..ఆత్మలు ఉన్నాయని అమెరికన్ డాక్టర్ చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత..?

Near Death Experience: ఆత్మలు ఉన్నాయి,మరణం తరువాత మరో జీవితం ఉంది  : రుజువులున్నాయంటున్న అమెరికా డాక్టర్

doctor Jeffrey near-death experiences fascination,

doctor Jeffrey near-death experiences fascination : మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది..? ఈ ప్రశ్న ఎంతో కాలంలో కొనసాగుతునే ఉంది. అలాగే ఆత్మలు ఉన్నాయా..? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆత్మ, పరమాత్మ, మనిషికి పునర్జన్మ..ఇటువంటి అంశాలపై చర్చలు వాదోపవాదాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆత్మలు లేవు ఏమీ లేవు ఇదంతా అభూత కల్పన అంటే ఎంతోమంది కొట్టిపారేస్తుంటారు. పాశ్చాత్యదేశాల్లో కూడా ఆత్మల్ని నమ్ముతుంటారనే విషయం తెలిసిందే. మనిషికి ఆత్మ ఉందని దానికి మరో జన్మ ఉంటుందని ఎంతోమంది నమ్ముతుంటారు. కానీ అదంతా వట్టి ట్రాష్ అని సైన్స్ కొట్టిపారేస్తుంది. కానీ ఆత్మలు ఉన్నాయా..? లేవా అనే విషయంపై మాత్రం పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. నిజా నిజాలను వెలికి తీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.

ఈక్రమంలో ఆత్మలు ఉంటాయని మనిషి చనిపోయిన తరువాత మరో ప్రపంచం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు ఓ అమెరికన్ డాక్టర్..! తానేమి మూఢత్వంతో ఆత్మలు ఉన్నాయని అనటంలేదని దానికి రుజువులు ఉన్నాయని ఎన్నో పరిశోధనల తరువాత నిర్ధారణ చేసుకుని చెబుతున్నానని అంటున్నారు అమెరికన్ డాక్టర్ కెంటకీకి చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ ( radiation oncologist)డా. జెఫ్రీ లాంగ్ (Dr. Jeffrey)..!!

తాను మనిషి చనిపోయిన తరువాత ఆత్మ ఉంటుందనేది నిజమేనని, మరణం తరువాతా ఓ జీవితం ఉందని అంటూ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు డాక్టర్ జెఫ్రీ లాంగ్. మరణం అంచులవరకూ వెళ్లిన ఐదు వేల మందిని అధ్యయనం చేశాకే ఈ నిర్ధారణకు వచ్చానని అదే విషయాన్ని ప్రకటించానని చెబుతున్నాడు డాక్టర్ జెఫ్రీ. ఇంకా చెప్పాలంటే ఐదు వేలమందికిపైగా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌ను అధ్యయనం చేశాక మరణం తరువాత జీవితం ఉందని చెబుతున్నానని అంటున్నారు డాక్టర్ జెఫ్రీ.

నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ షౌండేషన్
అంతేకాదు డాక్టర్ జెఫ్రీ అసలు మరణం తరువాత మనుషులకు ఏం జరుగుతుంది…? అనే విషయం పరిశోధనల కోసం ఓ ఫౌండేషన్ స్థాపించారు. అది ఇప్పుడు కాదు 1998లోనే స్థాపించారు. మనిషి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది..? నిజంగా మనిషి శరీరంలోంచి ఆత్మ బయటకు వెళ్లిపోతేనే చనిపోతాడా..? అనే విషయాల పెరిగిన ఆసక్తి అదేంటో తెలుసుకోవాలని కుతూహలంతో ఈ ఫౌండేషన్ స్థాపించటానికి కారణమైంది. అదేంటో తెలుసుకోవటానికి డాక్టర్ జెఫ్రీ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ షౌండేషన్ (fascination with near-death experiences)స్థాపించారు. దీని ద్వారా చేసిన పరిశోదనలతో ఆయన మరణం తరువాత ఆత్మకు మరో జీవితం ఉంటుందని చెబుతున్నారు.

Ulas family walks : అచ్చం ఆదిమానవుల్లా, ఈనాటికీ నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం ..

నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏమిటీ..?
నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్అం (near-death experiences)టే గుండె కొట్టుకోవటం ఆగిపోయిన మనిషి కోమాలోకి వెళ్లిపోవటం..ఆ క్రమంలో ఆ మనిషి అనుభవించే స్థితిని నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారని తెలిపారు డా. జెఫ్రీ. అంటే దాదాపు మరణం అంచులకు వెళ్లినట్లే. కోమాలోకి వెళ్లినవారు తిరిగి జీవించటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా కోమాలో మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన వారు చెప్పిన వివరాలను జెఫ్రీ పరిగణిలోకి తీసుకున్నారు. వారు చెప్పిన విషయాలను..వారి అనుభవాలపై పరిశోధనలు చేశారు.వారిలో కొంతమంది తమ శరీరం పనిచేయకపోయినా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగారరని చెప్పారట. అంతేకాదు. తమ చుట్టు ఉన్న పరిసరాలను కూడా గుర్తించారని..ఏం జరుగుతోందన్నది వినగాలిగారని వివరించారు జెఫ్రీ. ఇటువంటి అనుభవాలను చవిచూసిన అనేకమంది అనుభవాలని శాస్త్రీయంగా లోతైన అధ్యయణం చేసి ఆత్మ ఉనికిని, మరణం తరువాత మరో ప్రపంచాన్ని గుర్తించానని చెబుతున్నారు డాక్టర్ జెఫ్రీ. ఈ పరిశోధనలో తనుకు ఎన్నో ఆధారాలు కూడా లభించాయని తెలిపారు. ఆ ఆధారాలతోనే మనిషి మరణం తరువాత మరో ప్రపంచం ఉందని నేను నమ్ముతున్నానని స్పష్టంచేశారు. ఆత్మ ఉందని నేను బలంగా నమ్ముతున్నానని తెలిపారు.

దీంట్లో భాగంగా కొంతమంది చెప్పిన విషయాల గురించి డాక్టర్ జెఫ్రీ వివరిస్తు ఓ మహిళ గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు స్పృహ కోల్పోయింది. కానీ ఆమె మాత్రం తన శరీరం అక్కడ లేకపోయినా అక్కడ జరుగుతున్నదంతా తాను చూడగలిగానని తెలిపిందని వివరించారు. అక్కడివారు మాట్లాడిన మాటల్ని కూడా తాను వినగలిగానని తెలిపింది. అలా పలువురి అనుభవాలపై తాను అధ్యయనం చేశానని తెలిపారు.

CPR : సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? గుండెపోటు బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

45 శాతం మంది అనుభవాలు..
నియర్ డెత్ అనుభవం చవిచూసిన వారిలో దాదాపు 45 శాతం మంది తమ ఆత్మ శరీరం నుంచి వేరు పడిన విషయాన్ని గుర్తించారని..శరీరం నుంచి వెలుపలికి వచ్చిన ఆత్మ అక్కడే గాల్లో కాసేపు అక్కడక్కడే తిరిగిందని..దీంతో వారు అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ వినగలిగారని వివరించారు. అలాగే మరికొందరు తమ ఆత్మ ఓ చీకటి సొరంగంలోంచి ప్రయాణిస్తూ లుతురు వైపు ప్రయాణించిందని చెప్పారని డాక్టర్ జెఫ్రీ తెలిపారు. అలాగే గతంలో మరణించిన తమ బంధువులు, స్నేహితులను కలుసుకున్నామని చెప్పారట. అటువంటి సమయంలో తాము మొదట్లో తమ పరిస్థితిని గురించి అర్థం చేసుకోవటానికి కాస్త సమయం పట్టిందని ఆ తరువాత అసలు విషయం అర్థం అయి తమ జీవితం అంతా తమ కళ్లముందు కదలాడిందని వివరించారట. అంటే చచ్చి బతికినట్లు అన్నమాట.

అలా మరణం అంచుకు వెళ్లి వచ్చినవారు డాక్టర్ జెఫ్రీకి చెప్పిన విషయాలపై లోతుగా అధ్యయనం చేయగా ఆయన ఆత్మలు ఉన్నాయని నమ్మకానికి వచ్చారు. అది కేవలం తన నమ్మకం కాదని ఇది ఎంత మాత్రము మూఢత్వం కాదని ఆత్మలు ఉన్నాయని మనిషి చనిపోయిన తరువాత మరో ప్రపంచం ఉంటుందని తన పరిశోధనల్లో అర్థమైందని తెలిపారు. ఆత్మల గురించి తెలియని వారు కూడా ఇదే అనుభవాన్ని పొందిన విషయాన్ని డా. జెఫ్రీ లాంగ్ స్పష్టం చేశారు. ‘‘ఆత్మలు, మరణం తరువాత జీవితం’’ మాత్రం నిజమని తెలిపారు.