Artistic Dosa : వారెవ్వా..ఏమి దోశ.. ఇలాక్కూడా వేస్తారా? చూడటమే కాదు తిని తీరాల్సిందే..

వారెవ్వా ఏమి ఫేసు..అచ్చు హీరోలా ఉంది బాసూ అన్నట్లుగా ఉందీ ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి పెన్నంపై దోరగా కాల్చిన దోశ.దోశ.. ఇలాక్కూడా వేస్తారా? చూడటమే కాదు తిని తీరాల్సిందే అన్నట్లుగా ఉందీ..ఓ లుక్కేయండీ ఈ వీడియోపై..

Artistic Dosa :  వారెవ్వా..ఏమి దోశ.. ఇలాక్కూడా వేస్తారా? చూడటమే కాదు తిని తీరాల్సిందే..

street food vendor Artistic Dosa

Updated On : March 3, 2023 / 6:07 PM IST

Man’s Artistic Dosa : వారెవ్వా ఏమి ఫేసు..అచ్చు హీరోలా ఉంది బాసూ అన్నట్లుగా ఉందీ ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి పెన్నంపై దోరగా కాల్చిన దోశ. దోశలో వేయటంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ఫైవ్ స్టార్ హోటల్స్ లో షెఫ్ లకు ఏమాత్రం తీసిపోరు. ఎన్నో రకాల దోశలు వేసి వారెవ్వా అనిపించుకుంటుంటారు. అసలు హోటల్స్ లో కంటే వీధి బండ్ల వ్యాపారుల వద్ద ఉండే ఆ టేస్టే వేరు అన్నట్లుగా ఉంటాయి.

కొంతమంది బాహుబలి దోశ వేస్తే మరికొందరు పంచకట్టు దోశ అంటూ ఊరిస్తారు. ఇంకొందరు ఎమ్మెల్యే దోశ..ఎంపీ దోశ అంటూ వ్యాపారులు వారి వారి సృజనాత్మకతను చూపించి కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. సీజ్ దోశ, కారం దోశ, మసాలా దోశ,ఉల్లి దోశ ఇలా దోశల్లో ఉండే పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా ఉంటుంది.

ఇలా దోశల గురించి వెరైటీగా చెప్పుకుంటున్న మనం ఓ ప్రత్యేకమైన దోశ గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఆ దోశ అలాంటింటి దోశ కాదు..ఆ దోశ చూస్తే ..ఏంటీ దోశలు ఇలా కూడా వేస్తారా?అనిపిస్తుంది. దీన్ని ఎలా తినాలబ్బా అనిపిస్తుంది. ఇతగాడు వేసిన దోశ షేప్ చూస్తే అదే అనిపిస్తుంది మరి..పెన్నంపై దోశ పిండిని అలవోకగా వేస్తూ..ఓ ముద్దులొలికే ‘పిల్లి’ ఆకారంలా దోశను వేసి దోరగా కాల్చి ప్లేట్ లో పెట్టి కొబ్బరి చట్నీతో అందించాడీ వ్యాపారి.

నంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ఈ మనిషి ఆకారంలో ఉండే దోశ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చూస్తుంటునే నోరు ఊరేలా చేస్తోంది. ఏమి ఇతగాడి పనితం అనిపిస్తోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ..వీలైతే మీరు కూడా ఆ షేప్ లో దోశ వేయటానికి ట్రై చేయండీ..ట్రై చేస్తే పోయేందేముంది? దో గరిటెడు దోశ పిండి తప్ప..ఓకేనా..