Black Panther వామ్మో.. పిల్లిపిల్ల అని తెచ్చి పెంచుకుంటే బ్లాక్ పాంథర్ అయ్యింది .. మహిళ షాక్

పిల్లి అని తెెచ్చుకంటే పులి అయ్యింది. ఆ పులి కుక్కతో కలిసి చక్కగా ఆడుకుంటోంది. పులి కుక్క ఆటలు..పిల్లి పులిగా మారిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Black Panther వామ్మో.. పిల్లిపిల్ల అని తెచ్చి పెంచుకుంటే బ్లాక్ పాంథర్ అయ్యింది .. మహిళ షాక్

Black cat-Black Panther

Updated On : September 26, 2023 / 12:27 PM IST

Black cat-Black Panther : చాలామంది రోడ్డు పక్కన గాయాలో పడి ఉండే కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని చూసి చలించిపోతుంటారు. అయ్యో అంటూ వాటిని ఆస్పత్రికో లేదా వారి ఇంటికో తీసుకెళ్లి వాటికి వైద్యం చేయించి పెంచుకుంటుంటారు. అలా రష్యాకు చెందిన విక్టోరియా అనే ఓ మహిళా రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో పడి ఉన్న ఓ పసికూనను చూసింది. అయ్యో పాపం ఆ పిల్లి పిల్లకు ఏమైందో ఏంటో అనుకుని దాన్ని జాగ్రత్తగా బయటకు తీసి ఇంటికి తీసుకొచ్చింది. నల్లటి పిల్ల భలే ఉంది అనుకుంటో చాలా గారాబంగా పెంచుకుంటోంది. రోజు రోజుకు చక్కగా ముద్దుగా బొద్దుగా తయారైంది.

అలా అది భారీ పిల్లి కంటే పెద్దగా పెరుగుతుండటం చూసి ఆమె ఆశ్చర్యపోయేది.. కానీఅలా అలా అది పెరిగి పెరిగిన తరువాత షాక్ అయ్యిందామె. అది పిల్లి కాదు పులి అని నిర్ధారణకు వచ్చాక ఆమె ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. తాను నల్ల పిల్లిపిల్ల (Black cat)అని తెచ్చినది పిల్లి కాదు నల్లపులి అంటే బ్లాక్ పాంథర్ (Black Panther)అని తెలిసి ఆశ్చర్యపోయింది.

Deaf Lawyer Sara Sunny : సుప్రీంకోర్టులో సైగలతోనే మహిళా న్యాయవాది వాదనలు

అది బ్లాక్ పాంథర్ అని తెలిసిన తరువాత కూడా ఆమె దాన్ని అత్యంత ప్రేమగా పెంచుకుంటోంది. అది కూడా తాను పులి జాతికి చెందినదాన్ని అని మర్చిపోయిందో ఏమో ఆమెతో చాలా ప్రేమగా ఉంటోందట.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @Luna_the_pantera షేర్ చేసింది.

ఆ వీడియోలో పొదల్లో పసికూన కనిపించడం నుంచి అది బ్లాక్ పాంథర్ గా మారినది అంతా వివరంగా ఉంది. తన పెంపుడు కుక్కతో కలిసి బ్లాక్ పాంథర్ చక్కగా ఆడుకుంటోందంటూ వెల్లడించింది. కుక్కతో కలిసి బ్లాక్ పాంథర్ ఆడుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by @factmayor