shortest escalator : ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌కు గిన్నిస్ రికార్డ్

ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌ ని గిన్నిస్ రికార్డ్ వరించింది. ఈ చిన్ని ఎస్కలేటర్ కు ఎన్ని మెట్లు ఉన్నాయో తెలుసా..?

shortest escalator : ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌కు గిన్నిస్ రికార్డ్

world’s shortest escalator Guinness Record

Updated On : July 25, 2023 / 3:00 PM IST

world shortest escalator Guinness Record : ప్రపంచంలోనే అతి పెద్దవి.. అతి చిన్నవి ఎప్పుడు ఫేమస్ అవుతునే ఉంటాయి. ప్రపంచ రికార్డు (world Records)లు సాధిస్తునే ఉంటాయి. అలాంటిదే ఈ బుల్లి ఎస్కలేటర్ (shortest escalator). ఈ చిన్ని ఎస్కలేటర్ గిన్నిస్ రికార్డు ( world’s shortest escalator) సాధించింది.  ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌ (Guinness Book of Records)లో చోటు పొందింది.

ఎస్కలేటర్ అంటే ఎత్తుకు వెళ్లటానికి ఉపయోగించేది. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, మాల్స్ వంటిచోట్ల ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ కు వెళ్లేందుకు మెట్లు ఎక్కే అవసరం లేకుండా వీటిని ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. కానీ ఇంత చిన్న ఎస్కలేటర్ ఎందుకు ఏర్పాటు చేశారు..? కేవలం ఐదు మెట్లు ఎత్తుకోసం కోసం ఈ ఎస్కలేటర్ ఎందుకు..? అనే అనుమానం రానే వస్తుంది. మరి ఈ బుల్లి ఎస్కలేటర్ ఎక్కడుంది..? దీని విశేషాలేంటో చూద్దాం..

జపాన్‌ (Japan)లోని కవాసాకి (Kawasaki) నగరంలో ఉందీ బుల్లి ఎస్కలేటర్. కవాసాకి రైల్వే స్టేషన్‌ సౌతర్ గేట్ నుంచి నుంచి బయటకు వస్తే.. ఎదురుగా కనిపించే మోర్ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో ఉంది ఈ బుల్లి ఎస్కలేటర్‌. దీనికి ఉన్నవి కేవలం ఐదు మెట్లు మాత్రమే (only 5 steps) ఉంటాయి. దీంతో చిన్నపిల్లలు కూడా ఈపాటి ఎత్తు చక్కగా ఎక్కేస్తారు. మరి ఈ మాత్రందానికే ఎస్కలేటర్ అవసరమా? అంటుంటారు చూసేవారంతా. కానీ ఇంత చిన్న ఎస్కలేటర్ ను చూడటానికే ఆ సూపర్ మార్కెట్ కు జనాలు వస్తుంటారు. ఏదోకటి కొంటుంటారు. అంటే ఇక్కడ వ్యాపార తెలివితేటలు ఉన్నాయని అనుకోవాల్సిందే.

మార్కెట్ డిమాండ్ పెంచుకోవటానికి ఇలా బుల్లి ఎస్కలేటర్ ఏర్పాటు చేసి ఉంటారని.. ఇంకా వారి అవసరాలకు ఇలా దీన్ని ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఏది ఏమైనా ఈ బుల్లి ఎస్కలేటర్ చూడటానికి జనాలు బానే వస్తుంటారు. ఈ వింత ఎస్కలేటర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేసింది.