CM Revanth Reddy : వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు కార్యక్రమం.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, షర్మిల.. ఫొటోలు
CM Revanth Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సేంద్రీయ వ్యవసాయంలో విశిష్ట కృషి చేస్తున్న డాక్టర్ సుభాష్ పాలేకర్, డాక్టర్ సి.సుధా, డాక్టర్ నాగేశ్వరరావులకు వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తదితరులు పాల్గొన్నారు.







