Bharat jodo yatra: కేరళలో ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’.. ఫొటో గ్యాలరీ..
Bharat jodo yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో పాదయాత్ర’ శనివారం 10వ రోజు కేరళలలో ఉత్సాహంగా సాగింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో శనివారం ఉదయం పుతియకావు జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించారు. దాదాపు 12 కి.మీ మేర సాగిన యాత్ర.. అనంతరం అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం 11గంటలకు కాయంకుళంలో విరామం తీసుకున్న రాహుల్.. అక్కడ జీడీఎం ఆడిటోరియంలో నిరుద్యోగ సమస్యలపై కొందరు యువకులతో సమావేశం అయ్యారు. సాయంత్రం 5గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. రాత్రి 7గంటలకు చెప్పడ్ వద్దజరిగే సభలో రాహుల్ మాట్లాడతారు. రాత్రి హరిపాడు వద్ద ఎన్టీపీసీ గ్రౌండ్ లో బస చేస్తారు. ఇదిలాఉంటే యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి కరునాగపల్లి సమీపంలోని మాతా అమృతానందమయి ఆశ్రమంకు రాహుల్ వెళ్లారు. అక్కడ మాత ఆశీర్వాదం తీసుకున్నారు.
















