చంద్రబాబుకి 16 ఏళ్లు జైలు ఖాయం : మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిని వెలికి తీస్తే ఆ దేవుడు కూడా ఆయనను కాపాడలేడని.. 16 ఏళ్లు జైల్లో ఉంటారని పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు మంత్రి.
సీఎం జగన్ అవినీతిపరుడు, 6 నెలలు జైల్లో ఉన్నారు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. టీడీపీ ఆరోపిస్తున్నట్టు తాము రౌడీయిజం చేసే వాళ్లమైతే… ప్రజలు తమను గెలిపించే వాళ్లు కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో తీవ్ర కరవు వచ్చిందన్న మంత్రి.. జగన్ సీఎం అయ్యాక వర్షాలు సమృద్ధిగా కురిశాయని.. నదులు పొంగిపొర్లుతున్నాయని చెప్పారు.
వరదల కారణంగా ఇసుక తీయడం కష్టం అవుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఎవరు చనిపోయినా ఇసుక వల్లే చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త‍్వరలోనే ఇసుక కొరత తీరుతుందని అన్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు చెప్పినట్లు.. పవన్ నడుచుకుంటున్నారని తప్పుబట్టారు. చిత్తూరు జిల్లా మొగిలిఘాట్ రోడ్డు ప్రమాదం బాధాకరం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు.