CM Race: అందరి కళ్లూ సీఎల్పీ సమావేశం పైనే? ఆ ఇద్దరిలో సీఎం ఎవరు?

అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కేవలం ఒకే ఒక రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. డీకేకు కూడా అధిష్టానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు

CM Race: అందరి కళ్లూ సీఎల్పీ సమావేశం పైనే? ఆ ఇద్దరిలో సీఎం ఎవరు?

Updated On : May 15, 2023 / 11:23 AM IST

Legislative Party Meeting: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతోందనే అంశంపై కాంగ్రెస్ పార్టీయే కాకుండా ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఒకవైపు మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), మరొకవైపు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం ఖరారైన సమయం నుంచే ఇరు నేతల అభిమానులు తమ నాయకుడే సీఎం అంటే తమ నాయకుడే సీఎం అంటూ పోటాపోటీ ప్రకటనలు ఇస్తున్నారు.

DK vs Siddaramaiah: ఫలితాలు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోస్టర్ వార్

అయితే ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పరిశీలకు పాల్గొని సమావేశ వివరాలతో కూడిన నివేదికను అధిష్టానానికి ఈ పరిశీలకు అందిస్తారు.

Karnataka: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఫలితాలు ఎలా వచ్చాయి?

కాంగ్రెస్ పార్టీ విజయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ఇద్దరిదీ సమ భాగస్వామని కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది. అయితే వీరిలో ఒకరిని సీఎం చేస్తారనే విషయమై పార్టీ సైతం సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపితే.. ఆ వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటే బాగుంటుందని పార్టీ అధిష్టానం భావిస్తోందట. శాసనసభాపక్ష సమావేశంలో ఏకాభిప్రాయసాధన కోసం ప్రయత్నిస్తారట. ఒకవేళ ఇది అంతగా వర్కౌట్ కాకపోతే, ఓటింగ్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

CM of Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనేనా? ఇంతకీ కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో ఏముంది?

ఇకపోతే, సిద్ధరామయ్యకు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కేవలం ఒకే ఒక రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. డీకేకు కూడా అధిష్టానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. తాము సీఎం రేసులో ఉన్నట్టు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గతంలోనే సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎవరికి ఎవరూ పోటీ కాదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎన్నికలకు ముందు డీకే ప్రకటించగా, ఆరోగ్యకరమైన పోటీ మంచిదేనంటూ సిద్ధరామయ్య అన్నారు.