ఏపీ ఓటర్లు : 3 కోట్ల 69లక్షల 33వేల..

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 03:23 AM IST
ఏపీ ఓటర్లు : 3 కోట్ల 69లక్షల 33వేల..

అమరావతి : ఓటర్ల తుది జాబితాను ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతిచ్చింది. ఈమేరకు శనివారం తమ వెబ్ సైట్ లో వివరాలు పొందుపరుస్తామని ఈసీ తెలిపింది. పూర్తి జాబితా ప్రకటించాక ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకోవచ్చని పేర్కొంది.

ఓటర్ల జాబితాలో పేరు లేనివారు మళ్లీ తాజాగా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానాల్లో ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకు ఇందుకు అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ఏపీలో ఓటర్ల లెక్క తేలింది. రాష్ట్రంలో మొత్తం 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నారని వివరించింది. వీరిలో 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది, థర్డ్ జెండర్ 3,761 మంది ఉన్నారు.