Maneka Gandhi : సుల్తాన్‌పూర్‌ బరిలో మేనకా గాంధీ.. ఈ బీజేపీ అభ్యర్థి రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని వాస్తవాలివే!

Maneka Gandhi : మాజీ మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీతో పిలిభిత్ సీటు మార్చుకున్న తర్వాత 2019లో సుల్తాన్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు.

Maneka Gandhi : సుల్తాన్‌పూర్‌ బరిలో మేనకా గాంధీ.. ఈ బీజేపీ అభ్యర్థి రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని వాస్తవాలివే!

5 Facts About Maneka Gandhi, BJP Candidate For Uttar Pradesh's Sultanpur

Maneka Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి మేనకా గాంధీని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బరిలో దింపింది. గతంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖగా పనిచేసిన మేనకా గాంధీ 2019లో తన కుమారుడు వరుణ్ గాంధీతో సీట్లు మార్చుకున్న తర్వాత సుల్తాన్‌పూర్ లోకస్థానంలో పోటీ చేసి గెలిపొందారు. పిలిభిత్‌లో ఉన్న మేనకా గాంధీ తన అసలు నియోజకవర్గమైన సుల్తాన్‌పూర్‌కు మారారు. సుల్తాన్‌పూర్ శాసనసభ్యుడిగా వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి పోటీ చేశారు.

Read Also : టీడీపీ, జనసేన పార్టీలకు ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన పలువురు నేతలు

మేనకా గాంధీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలివే :
1. మేనకా గాంధీ ఆగస్టు 26, 1956న ఢిల్లీలో అమర్‌దీప్ కౌర్ ఆనంద్, లెఫ్టినెంట్ కల్నల్ తర్లోచన్ సింగ్ ఆనంద్ దంపతులకు జన్మించారు. ఆమె సనావర్‌లోని లారెన్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో మేనకా గాంధీ జర్మన్ కూడా అభ్యసించారు.

2. మొదటిసారిగా 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీని మేనకా గాంధీ కలిశారు. ఒక ఏడాది తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

3. 1980లో మేనకా గాంధీకి 23 ఏళ్లు మాత్రమే.. ఆమె కుమారుడు వరుణ్ గాంధీకి కేవలం మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు భర్త సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు.

4. మేనకా గాంధీ 1983లో అజంగఢ్‌కు చెందిన రాజకీయ నేత అక్బర్ అహ్మద్‌తో కలిసి రాష్ట్రీయ సంజయ్ మంచ్‌ను స్థాపించారు. 1984లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై ఆమె స్వతంత్ర అభ్యర్థిగా మొదటి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1988లో ఆమె వీపీ సింగ్ జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్‌సభకు జనతాదళ్ టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఇదే స్థానానికి 6 సార్లు ప్రాతినిధ్యం వహించారు.

5. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మేనకా గాంధీ 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, ఆమెకు అప్పట్లో మంత్రివర్గం ఇవ్వలేదు. మేనకా గాంధీ రచయిత్రి, కాలమిస్ట్, జంతు హక్కుల కార్యకర్త కూడా.

ఏప్రిల్ 19 నుంచి యూపీలో లోక్‌సభ తొలి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. జూన్ 7 వరకు మొత్తం 7 దశల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, జూన్ 4న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే తొలి దశకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ, మార్చి 28న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30గా ఈసీ పేర్కొంది.

Read Also : Maganti Babu : టీడీపీకి బిగ్ షాక్? మాజీ ఎంపీ గుడ్ బై?