అప్పుడు రూ. 300..ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి బాబూ : లక్ష్మీ పార్వతి

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 11:56 AM IST
అప్పుడు రూ. 300..ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయి బాబూ : లక్ష్మీ పార్వతి

Updated On : February 7, 2020 / 11:56 AM IST

1978లో ఎమ్మెల్యేగా రూ. 300 తీసుకున్న చంద్రబాబు..ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ప్రజల సొమ్ము దోచుకున్న బాబుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

బాబు ఆస్తుల కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌పై 2020, జనవరి 07వ తేదీ శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమెతో 10tv ముచ్చటించింది. 

మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై 2005లో ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇలా కంప్లయింట్ చేయగానే..హైకోర్టును బాబు స్టే తెచ్చుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 2005 వచ్చినా..స్టే ఇంకా కొనసాగుతూనే ఉందని లాయర్లు చెబుతున్నారని వెల్లడించారు.

అయితే..ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 6 నెలలోపు ఉన్న కేసులకు స్టే వెకేట్ చేస్తూ సుప్రీం తీర్పు చెప్పిందన్నారు. ఇదే అంశాన్ని తాము కోర్టుకు తెలపడం జరిగిందన్నారు.

* బాబు సీఎంగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని..ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీ పార్వతి 2005లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
* విచారణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ..2005లో స్టే విధించింది కోర్టు. 

* స్టేను ఎత్తివేయాలని మరోసారి లక్ష్మీ పార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు. 
* హైకోర్టు కొట్టేయడంతో అప్పటి నుంచి స్టే కొనసాగుతోంది. 
* తర్వాత హైకోర్టు ఇచ్చిన స్టే పొడగింపు లేకపోవడంతో విచారణ కొనసాగుతోంది.