బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేం 

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 11:26 AM IST
బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేం 

Updated On : December 4, 2019 / 11:26 AM IST

వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ తీరును తప్పు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. బీజేపీతో సఖ్యతపై పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టలేమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. బుధవారం(డిసెంబర్ 4, 2019) అచ్చెన్నాయుడితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ ఎవరికి వ్యతిరేకం కాదని.. ప్రజల సమస్యలపై పోరాడుతారని చెప్పారు. హోదా విషయంలో మాత్రమే బీజేపీతో విభేదించారని తెలిపారు. తమ ఓటమితో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అనుకుంటున్నారని చెప్పారు. పవన్ వ్యాఖ్యలను తప్పు పెట్టాల్సిన పని లేదన్నారు.