ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

  • Published By: chvmurthy ,Published On : November 4, 2019 / 10:35 AM IST
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

Updated On : November 4, 2019 / 10:35 AM IST

ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ  ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవిలోంచి బదిలీ చేశారు.  ఆయన్ను  బాపట్ల లోని హెచ్ఆర్డీ  డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరబ్ కుమార్ ప్రస్తుతం సీసీఎల్ ఏ లో పని చేస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌ నీరబ్ కుమార్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి  ప్రవీణ్ ప్రకాష్  ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీతో అధికార యంత్రాంగం షాక్ అయ్యింది. ఎన్నికల ముందు ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనే కొనసాగుతూ వచ్చారు. మార్పు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రాజకీయ వర్గాల్లోనే ఇదే చర్చనీయాంశం అయ్యింది.

జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. మొదట్లో ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా సీఎం జగన్ వెంటే ఉన్నారు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం.