గంగవరం పోర్టును అదానీకి అమ్మేశారు, మీరే దోచుకుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?- సీఎం జగన్‌పై షర్మిల ఫైర్
ఇదెక్కడి న్యాయం? ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుందని ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా మీరే దొంగలై మీరే దోచుకుంటుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?

YS Sharmila Fires On CM Jagan
YS Sharmila : విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటన్నారు. గతంలో కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీయే అంటూ గుర్తు చేశారు. గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకు సీఎం జగన్ అదానీకి అమ్మడం దుర్మార్గమన్నారు షర్మిల. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటీకరణ అంశాన్ని రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
”విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అంటే మీకే కాదు మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకు అప్పనంగా శాశ్వతంగా అదానీకి అప్పజెప్పారు. ఇదెక్కడి న్యాయం? ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుందని ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా మీరే దొంగలై మీరే దోచుకుంటుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?” అంటూ నిప్పులు చెరిగారు షర్మిల.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?