3 రోజులు పండుగ : ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

  • Published By: chvmurthy ,Published On : October 31, 2019 / 02:51 PM IST
3 రోజులు పండుగ : ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

Updated On : October 31, 2019 / 2:51 PM IST

నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్, సీఎం హాజరవుతారు. అమరజీవి పొట్టిశ్రీరాములకు ప్రత్యేక నివాళులర్పిస్తారు. స్వాతంత్ర సమరయోధుల వారసులకు సన్మానాలు చేస్తారు. 

మూడు రోజుల పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబంబించేలా వేడుకలు నిర్వహించనున్నారు. కూచిపూడి నృత్యాలు, సురభి నాటకాలతో పాటు 21 చేనేత, హస్తకళల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రుచులను అందించే 25 ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.